మహానటి సినిమా కారణంగానే అలాంటి పాత్రలకి దూరం అంటున్న కీర్తి సురేష్  

Keerthi Suresh Open Up Her Movie Selection In Telugu - Telugu, Miss India Moviea, South Cinema, Telugu Cinema, Tollywood

నేను శైలజ సినిమాతో టాలీవుడ్ లో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చి మొదటి సినిమాతోనే మంచి మార్కులు కొట్టేసిన మలయాళీ ముద్దుగుమ్మ కీర్తి సురేష్.సినిమా ఫ్యామిలీ నుంచి వచ్చి కీర్తి సురేష్ ముందుగా మలయాళంలో ఎంట్రీ ఇచ్చి అక్కడ సక్సెస్ అందుకొని తరువాత తెలుగులో ఎంటర్ అయ్యింది.

 Keerthi Suresh Open Up Her Movie Selection In Telugu

ఇక ఆమె కెరియర్ లో సావిత్రి బయోపిక్ గా వచ్చిన మహానటి సినిమా ఒక మైలురాయి అని చెప్పాలి.తెలుగులో కేవలం నాలుగో సినిమాగానే మహానటి లాంటి అద్భుతమైన సినిమాలో నటించే అవకాశం సొంతం చేసుకోవడం, ఆ సినిమాతో జాతీయ అవార్డు సైతం సొంతం చేసుకోవడం నిజంగా గొప్ప విషయం అని చెప్పాలి.

మహానటి సినిమా తర్వాత ఆమె ఇమేజ్ పూర్తిగా మారిపోయింది.ఈ నేపధ్యంలో తమిళంలో కమర్షియల్ సినిమాలు చేస్తున్న తెలుగులో మాత్రం సినిమాల ఎంపికలో ఆమెకి మహానటి ఇమేజ్ పెద్ద అడ్డంకిగా మారింది.

మహానటి సినిమా కారణంగానే అలాంటి పాత్రలకి దూరం అంటున్న కీర్తి సురేష్-Movie-Telugu Tollywood Photo Image

ఈ నేపధ్యంలో మహానటి తర్వాత ఆమెకి గ్లామర్‌ రోల్స్ చాలా వచ్చిన వాటికి రిజక్ట్ చేసేసింది.చాలా సెలక్టివ్ గా తెలుగులో సినిమాలు చేస్తుంది.తెలుగులో సినిమాలు తగ్గించడంపై ఇటీవలి ఓ ఇంటర్వ్యూలో కీర్తి స్పందించింది.నన్ను ప్రేక్షకులు కేవలం ఓ సాధారణ హీరోయిన్‌లా కాకుండా ఓ మంచి నటిగా చూస్తున్నారు.

అందుకే పాత్రల ఎంపికలో జాగ్రత్తపడుతున్న.నన్ను బోల్డ్ క్యారెక్టర్స్‌లో చూసేందుకు ప్రేక్షకులు ఇష్టపడరు.

వ్యక్తిగతంగా కూడా అలాంటి పాత్రలు చేయడం నాకిష్టం లేదని కీర్తి చెప్పింది.తెలుగు ప్రేక్షకులు తనని నుంచి చాలా ఎక్కువ ఎక్స్ పెక్ట్ చేస్తున్నారని, ఆ స్థాయిలో పెర్ఫార్మెన్స్ లేకపోతే సినిమా మీద ప్రభావం చూపించే అవకాశం ఉన్న నేపధ్యంలోనే కీర్తి సురేష్ సెలక్టివ్ గా సినిమాలు చేస్తుందని ఆమె మాటల బట్టి తెలుస్తుంది.

.

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు

Keerthi Suresh Open Up Her Movie Selection In Telugu Related Telugu News,Photos/Pics,Images..

footer-test