టాలీవుడ్ టాప్ హీరోయిన్ లలో ఒకరిగా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్న నటి కీర్తి సురేష్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.ఎనర్జిటిక్ హీరో రామ్ సరసన నేను శైలజ చిత్రం ద్వారా తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన ఈ ముద్దుగుమ్మ ఆ తర్వాత వరుస తెలుగు తమిళ చిత్రాలతో బిజీగా ఉన్నారు.
మహానటి సావిత్రి జీవిత కథ ఆధారంగా తెరకెక్కిన మహానటి సినిమా ద్వారా జాతీయ ఉత్తమ నటి అవార్డును సైతం గెలుచుకున్నారు.ఇకపోతే స్పోర్ట్స్ బ్యాక్ డ్రాప్ లో కీర్తి సురేష్ నటించిన గుడ్ లక్ సఖి చిత్రం ఎప్పుడో విడుదల కావాల్సి ఉండగా ఎన్నో కారణాల వల్ల ఈ సినిమా విడుదల వాయిదా పడుతూ వస్తుంది.
ఈ క్రమంలోనే ఈ సినిమాని 28వ తేదీన థియేటర్లలో విడుదల చేయడానికి ఏర్పాట్లు పూర్తయ్యాయి.ప్రస్తుతం ఈ సినిమా ప్రమోషన్ కార్యక్రమాలను వేగవంతం చేస్తున్నారు.
సోషల్ మీడియాలో ఎంతో యాక్టివ్ గా ఉండే కీర్తి సురేష్ ట్విట్టర్ ద్వారా మరొక ఆసక్తికరమైన విషయాన్ని వెల్లడించారు.గణతంత్ర దినోత్సవం సందర్భంగా నేను అధికారకంగా యూట్యూబ్ ఛానల్ ప్రారంభించినందుకు ఎంతో సంతోషంగా ఉంది అంటూ తన యూట్యూబ్ ఛానల్ గురించి వెల్లడించారు.
సోషల్ మీడియాలో ఎంతో యాక్టివ్ గా ఉంటూ తనకు సంబంధించిన విషయాలను అభిమానులతో పంచుకునే కీర్తి సురేష్ యూట్యూబ్ ఛానల్ ద్వారా తనకు సంబంధించిన వీడియోలను అభిమానులతో పంచుకోనున్నట్లు తెలుస్తోంది.ఇలా ఇప్పటికే చాలా మంది క్యారెక్టర్ ఆర్టిస్టులు బుల్లితెర నటీనటులు యూట్యూబ్ ఛానల్ ద్వారా ప్రేక్షకులను సందడి చేయగా మొట్ట మొదటిసారి హీరోయిన్లలో కీర్తి సురేష్ యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసి ప్రేక్షకులకు దగ్గరవడం కోసం ప్రయత్నాలు చేస్తున్నారు.ఇక ఈమె సినిమాల విషయానికి వస్తే మహేష్ బాబు సరసన సర్కార్ వారి పాట చిత్రం లో నటిస్తున్నారు.అదే విధంగా మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న భోళా శంకర్ సినిమాలో మెగాస్టార్ చిరంజీవి చెల్లెలి పాత్రలో నటిస్తున్నారు.
ప్రస్తుతం ఈ రెండు సినిమాలు షూటింగ్ పనులను జరుపుకుంటున్నాయి.