రివ్యూ : కీర్తి సురేష్‌ 'మిస్‌ ఇండియా' ఎలా ఉందంటే..!

మహానటి సినిమాతో జాతీయ అవార్డును దక్కించుకున్న కీర్తి సురేష్‌ హీరోయిన్‌గా వరుసగా సినిమాలు చేస్తోంది.కమర్షియల్‌ మూవీస్ తో పాటు లేడీ ఓరియంటెడ్‌ సినిమాలను కూడా ఈ అమ్మడు ఎక్కువగా చేస్తోంది.

 Keerthy Suresh Miss India Ott Movie Review , Miss India, Keerthy Suresh, Miss In-TeluguStop.com

ఈమె నటించిన లేడీ ఓరియంటెడ్‌ సినిమాలు థియేటర్లు లేకపోవడంతో ఒక్కటి ఒక్కటిగా ఓటీటీ ద్వారా ప్రేక్షకుల ముందుకు వస్తున్నాయి.ఆమద్య పెంగ్విన్‌ సినిమా ప్రేక్షకులముందుకు రాగా తాజాగా మిస్ ఇండియా సినిమా ఓటీటీ ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చేసింది.

ఈ సినిమాకు ప్రేక్షకుల నుండి రివ్యూవర్స్ నుండి నెగటివ్‌ టాక్‌ వచ్చింది.సినిమా స్టోరీ పాయింట్‌ కొత్తగా ఉన్నా దాన్ని కొత్తగా ఆకట్టుకునేలా తీయడంలో దర్శకుడు నరేంద్ర నాథ్‌ పూర్తిగా విఫలం అయ్యాడు.

ఈ సినిమా టైటిల్‌ ను బట్టి అంతా ఇది ఒక అందాల పోటీకి సంబంధించిన సినిమా అనుకున్నారు.అలా చాలా వరకు సినిమాపై ఆసక్తిని కనబర్చలేదు.

టైటిల్‌తో మొదటి నిరుత్సాహం.ఆ తర్వాత సినిమా విడుదలైన తర్వాత స్క్రీన్‌ ప్లేలో చాలా లొసుగులు ఉన్నాయి అంటూ టాక్‌ వినిపించింది.

కీర్తి సురేష్‌ నటన అన్ని సినిమాల్లో మాదిరిగానే ఈ సినిమాలో కూడా ఆకట్టుకుంది.ఇక ఇతర పాత్రల గురించి చెప్పాలంటే వచ్చి పోతూ ఉన్నాయి.దర్శకుడు చెప్పాలనుకున్న కథను తిప్పి తిప్పి బోర్‌ కలిగించి మరీ చెప్పాడు.కథను చెప్పే సమయంలో దాన్ని ఆసక్తికర సన్నవేశాలతో తెరకెక్కిస్తే బాగుంటుంది.

కాని ఆయన మాత్రం కథను మాత్రమే ఫోకస్‌ పెట్టాడు.సినిమాలో ఉండాల్సిన ఇతర ఎలిమెంట్స్‌ ను మర్చి పోయాడు.

కమర్షియల్‌ సినిమాలకు మరియు ఎంటర్‌ టైన్‌ మెంట్‌ సినిమాలకు అలవాటు పడ్డ ప్రేక్షకులు ఈ సినిమాతో బోర్‌ ఫీల్‌ అవ్వడం ఖాయం.మిస్ ఇండియా సినిమా కథ ఒక సాదారణమైన మద్య తరగతి అమ్మాయి అమెరికాలో కాఫీ షాప్‌ పెట్టి పెద్ద వ్యాపారవేత్తగా ఎలా ఎదిగింది.

ఆ క్రమంలో ఆమె ఎదుర్కొన్న సవాళ్లు ఏంటీ అనేది కథ. మంచి స్కోప్‌ ఉన్న కథ.కాని దర్శకుడు మాత్రం నిరాశ పర్చాడు.కీర్తి సురేష్‌ కు మరో ఓటీటీ ప్లాప్‌.

ఇక ఈమె నటించిన గుడ్‌ లక్‌ సఖీ సినిమా విడుదలకు సిద్దంగా ఉంది.మరి అది ఎలా ఉంటుందో చూడాలి.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube