కీర్తి సురేష్ మిస్ ఇండియా డేట్ ఫిక్స్ చేసుకుంది  

Keerthi Suresh Miss India Movie Release Date Fix - Telugu Keerthi Suresh, Miss India Movie Release Date Fix, South Cinema, Tollywood

మహానటి సినిమాతో టాలీవుడ్ ఒక్కసారిగా ప్రతి ఒక్కరి దృష్టిని ఆకర్షించి అభినవ సావిత్రి గుర్తింపుని సొంతం చేసుకున్న నటి కీర్తి సురేష్.మహానటి తర్వాత కీర్తి ఇప్పటి వరకు తెలుగులో డైరెక్ట్ సినిమాతో ప్రేక్షకుల ముందుకి రాలేదు.

Keerthi Suresh Miss India Movie Release Date Fix - Telugu South Cinema Tollywood

తమిళంలో విశాల్ పందెం కోడి సీక్వెల్, సూర్య సినిమాలతో ప్రేక్షకుల ముందుకి వచ్చింది.అయితే ఆ సినిమాలు అనుకున్న స్థాయిలో తెలుగులో సక్సెస్ అవ్వలేదు.

దీంతో ఎప్పటి నుంచో తెలుగులో కీర్తి సినిమా కోసం ఆమె ఫ్యాన్స్ ఎదురుచూస్తున్నారు.అయితే తెలుగులో ఇప్పటికే రెండు సినిమాలు ఫిక్స్ కీర్తి సురేష్ ఫిక్స్ చేసిన సంగతి తెలిసిందే.

అందులో మిస్ ఇండియా టైటిల్ తో తెరకెక్కిన సినిమాకి సంబందించిన లుక్స్ ఇప్పటికే ప్రేక్షకుల ముందికి వచ్చాయి.ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం జరుగుతుంది.ఇక ఈ సినిమా రిలీజ్ డేట్ ని చిత్ర యూనిట్ అఫీషియల్ గా కన్ఫర్మ్ చేసింది.ఏప్రిల్ 17న మిస్ ఇండియా సినిమా ప్రేక్షకుల ముందుకి రాబోతుంది.

ఇదిలా ఉంటే ఏప్రిల్ లో నాని, రామ్, అఖిల్, శర్వానంద్ సినిమాలు వరుసగా ప్రేక్షకుల ముందుకి రానున్నాయి.మరి వీరిని తట్టుకొని లేడీ ఒరియాంటెడ్ గా వస్తున్న కీర్తి సురేష్ మిస్ ఇండియా తెలుగు ప్రేక్షకులని ఎంత వరకు మెస్మరైజ్ చేస్తుంది.

అలాగే మహానటి బజ్ ఈ సినిమాకి ఉపయోగపడుతుందా అనేది వేచి చూడాలి.

తాజా వార్తలు

Keerthi Suresh Miss India Movie Release Date Fix-miss India Movie Release Date Fix,south Cinema,tollywood Related Telugu News,Photos/Pics,Images..