తల్లి సినిమా రీమేక్ లో హీరోయిన్ గా కీర్తి సురేష్  

Keerthi Suresh Play Her Mother Role In Old Remake Movie-keerthi Suresh,kollywood,old Remake Movie,play Her Mother Role,rajinikanth,tollywood

మలయాళీ ఇండస్ట్రీ నుంచి తెలుగు, తమిళ భాషలలో అడుగు పెట్టి స్టార్ హీరోయిన్ గా ఎదిగిన నటి కీర్తి సురేష్.మహానటి సినిమాతో జాతీయ అవార్డు కూడా అందుకున్న కీర్తి సురేష్ ప్రస్తుతం సౌత్ లో తన పాత్ర ప్రాముఖ్యత చూసుకొని సినిమాలు చేస్తుంది.

Keerthi Suresh Play Her Mother Role In Old Remake Movie-Keerthi Kollywood Old Movie Play Rajinikanth Tollywood

తెలుగులో మిస్ ఇండియా సినిమాలో నటిస్తున్న కీర్తి సురేష్ మరో సినిమాలో నానికి జోడీగా నటించడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు టాక్ ఉంది.ఇదిలా ఉంటే ఇప్పుడు కీర్తి సురేష్ తమిళంలో 80లలో రజినీకాంత్ ఆమె తల్లి మేనకా హీరోయిన్స్ కలిసి నటించిన నేత్రిక్కన్ అనే సినిమా రీమేక్ లో తల్లి పాత్రలోనే నటించడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు తెలుస్తుంది.


కీర్తి తల్లి మేనక గతంలో తమిళ, కన్నడ సినిమాల్లో స్టార్ హీరోయిన్ గా గుర్తింపు తెచ్చుకుంది.సూపర్ స్టార్ రజినీకాంత్ తో కలిసి చాలా సినిమాలలో ఆమె ఆదిపాడింది.

అందులో ఒక సూపర్ సినిమా నేత్రిక్కన్.దీనిని రీమేక్ చేయడానికి రజినీకాంత్ అల్లుడు స్టార్ హీరో ధనుష్ ప్లాన్ చేస్తున్నాడు.

తన సొంతం ప్రొడక్షన్ లోనే ఈ సినిమాని తెరకెక్కించాలని చూస్తున్నాడు.ఈ నేపధ్యంలో మేనక చేసిన పాత్ర కోసం ఆమె కూతురు కీర్తి సురేష్ ని తీసుకోవాలని ఫిక్స్ అయ్యారు.

దీనికి కీర్తి కూడా ఒకే చెప్పింది.త్వరలో ఈ సినిమా సెట్స్ పైకి వెళ్ళే అవకాశం ఉందని తెలుస్తుంది.

అదే కథని ఉంచి ప్రెజెంట్ నేటివిటీకి కనెక్ట్ చేస్తూ స్క్రిప్ట్ వర్క్ చేస్తున్నట్లు తెలుస్తుంది.ఇప్పటికే ధనుష్, కీర్తి కాంబినేషన్ లో తమిళంలో రైల్ అనే సినిమా వచ్చింది.

అయితే అది ఎవరేజ్ టాక్ తెచ్చుకుంది.మరోసారి ఈ రీమేక్ తో వీరిద్దరి జోడీ కోలీవుడ్ లో సందడి చేయబోతుంది.

.

తాజా వార్తలు

Keerthi Suresh Play Her Mother Role In Old Remake Movie-keerthi Suresh,kollywood,old Remake Movie,play Her Mother Role,rajinikanth,tollywood Related....