తెలుగులో కీర్తి సురేష్ మొదటి సినిమా అంటే ఎవరైనా నేను శైలజ అని చెబుతారు.అయితే అంతకంటే ముందుగానే ఈ మల్లు బ్యూటీ ఓ సినిమాలో నటించింది.
సీనియర్ యాక్టర్ నరేష్ కొడుకు నవీన్ కృష్ణ హీరోగా తెరకెక్కిన మొదటి సినిమాలో కీర్తి సురేష్ హీరోయిన్ గా పరిచయం అయ్యింది.చంటి అడ్డాల లాంటి పెద్ద నిర్మాతనే ఈ సినిమాని నిర్మించారు.
అయితే ఆర్ధిక కారణాలతో ఈ సినిమా షూటింగ్ జరుపుకున్న తర్వాత రిలీజ్ కి నోచుకోలేదు.అయితే ఒటీటీ పుణ్యమా అని మళ్ళీ ఈ సినిమాని రిలీజ్ చేసేందుకు నిర్మాత ప్లాన్ చేస్తున్నారు.
రామ్ ప్రసాద్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాకి సంబందించిన ప్యాచ్ వర్క్ పూర్తి చేసి రిలీజ్ చేయాలని అనుకుంటున్నారు.అయితే ఈ సినిమాకి ముందుగా అయినా ఇష్టం నువ్వు అనే టైటిల్ పెట్టారు.
తరువాత మళ్ళీ టైటిల్ మార్చి జానకితో నేను అని పెట్టి రిలీజ్ చేద్దామని అనుకున్నారు.
అప్పుడు రిలీజ్ సాధ్యం కాలేదు.
మళ్ళీ ఇప్పుడు సినిమాకి రెండు జళ్ల సీత అనే కొత్త టైటిల్ పెట్టి సినిమాని రిలీజ్ చేయడానికి ప్లాన్ చేస్తున్నారు.ఈ విషయంపై నిర్మాత చంటి అడ్డాల క్లారిటీ ఇచ్చారు.
నవీన్ విజయకృష్ణ, కీర్తీ సురేశ్ జంటగా నిర్మించిన చిత్రానికి రెండు జళ్ల సీత టైటిల్ ఖరారు చేసినట్టు చంటి అడ్డాల తెలిపారు.ప్రస్తుతం నిర్మాణానంతర కార్యక్రమాలు జరుగుతున్నాయనీ, ఫస్ట్ కాపీ వచ్చాక ఫైనల్ ఎఫెక్ట్ ఎలా ఉందో చూసుకుని అవసరమైతే మరో రెండు మూడు రోజులు చిత్రీకరణ చేసి మంచి చిత్రాన్ని ప్రేక్షకులకు అందిస్తామని ఆయన అన్నారు.
తొలుత కొన్ని టైటిళ్లు అనుకున్నప్పటికీ చివరకు ఈ టైటిల్ ఖరారు చేశామని పేర్కొన్నారు.మరి ఈ సారైనా ఈ సినిమా రిలీజ్ కి నోచుకుంటుందో లేదో అనేది చూడాలి.