కీర్తి సురేష్‌ రెండు పడవల ప్రయాణం

ఈమద్య కాలంలో హీరోయిన్స్‌ చాలా సేఫ్ గేమ్‌ ఆడుతున్నారు.మొదట ఎక్కువగా కమర్షియల్‌ పాత్రలకు సిద్దం అవుతున్నారు.

 Keerthy Suresh Doing Commercial  Films And Lady Oriented Film , Keerthy Suresh ,-TeluguStop.com

ఆ తర్వాత కెరీర్‌ ఎండింగ్‌కు వచ్చింది అనుకుంటే అప్పుడు లేడీ ఓరియంటెడ్‌ చిత్రాలు చేస్తున్నారు.చాలా తక్కువ మంది మాత్రమే ఒక వైపు కమర్షియల్‌ సినిమాలు మరో వైపు లేడీ ఓరియంటెడ్‌ సినిమాలు చేస్తారు.

అందులో ఇప్పుడు కీర్తి సురేష్‌ కూడా చేరింది.ఈ అమ్మడు మహానటి చిత్రం తర్వాత బిజీ అయ్యింది.

భారీ ఎత్తున ఈమెకు కమర్షియల్‌ హీరోయిన్‌గా పేరు వచ్చినా కూడా మహానటితో ఈమెకు లేడీ ఓరియంటెడ్‌ సినిమాల్లో ఆఫర్లు వస్తున్నాయి.అలా చేసిందే పెంగ్విన్‌, మిస్‌ ఇండియా, గుడ్‌ లక్‌ సఖి.

ఈ మూడు సినిమాల్లో ఇప్పటికే పెంగ్విన్‌ సినిమా విడుదల అయ్యింది.అందుకు సంబంధించిన టాక్‌ కూడా ముగిసి పోయింది.

ఎందుకంటే ఆ సినిమా ప్రేక్షకులను నిరాశ పర్చింది.
తెలుగు లో ఈమెకు ఉన్న స్టార్‌డంను ఉపయోగించుకోకుండా వరుసగా లేడీ ఓరియంటెడ్‌ చిత్రాలు చేస్తున్న కారణంగా ఈమెను కొందరు అవమానించడంతో పాటు అవహేళన చేస్తున్నారు.

ఇలాంటి తెలివి తక్కువ పనులు ఎందుకు చేస్తున్నారు అంటూ నెటిజన్స్‌ ఆమెపై అభిమానంతో విమర్శలు కురిపిస్తున్నారు.కమర్షియల్‌ సినిమాల్లో మీరు నటిస్తే కొంత కాలం పాటు మీరు ఇండస్ట్రీలో కొనసాగుతారు.

కాని మీరు చేస్తున్న ఈ రెండు పడవల ప్రయాణం కారణంగా ఈమె చాలా త్వరగా కెరీర్‌ను ముగించే ప్రమాదం ఉంటుందని కొందరు హెచ్చరిస్తున్నారు.

ఈ విషయంలో ఆమెకు మంచి సలహాలు ఇచ్చే వారు కరువయ్యారా లేదంటే ఆమె ఇతరులను పట్టించుకోకుండా తాను ఏదైతే అనుకుందో అదే చేయాలని భావిస్తుందా అంటూ అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.

ఈమద్య కాలంలో ఈమె సర్కారు వారి పాట సినిమాకు ఓకే చెప్పింది.ఆ సినిమా భారీ విజయాన్ని సొంతం చేసుకుంటుందని అంతా నమ్మకంగా ఉన్నారు.కనుక కీర్తి సురేష్‌ ఖచ్చితంగా కమర్షియల్‌గా మరో హిట్‌ కొట్టడం ఖాయం.కనుక రెండు పడవల ప్రయాణం మానేసి కేవలం కమర్షియల్‌ మూవీస్‌ మాత్రమే చేయలంటూ అభిమానులు కోరుకుంటున్నారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube