మహానటితో జూనియర్ అతిలోక సుందరి! బీటౌన్ లో సందడి  

జాన్వీ కపూర్ తో చెట్టపట్టాల్ వేసుకొని తిరుగుతున్న కీర్తి సురేష్. .

Keerthi Suresh And Jhanvi Kapoor In Mumbai-keerthi Suresh And Jhanvi Kapoor,mumbai,telugu Cinema,tollywood

మహానటి సావిత్రి బయోపిక్ తో తాను కూడా అభినవ మహానటి అనే గుర్తింపు తెచ్చుకొని సౌత్ లో వరుస సినిమాలతో దూసుకుపోతున్న నటి కీర్తి సురేష్. ప్రస్తుతం కీర్తి తెలుగులో ఓ లేడీ ఓరియంటెడ్ సినిమాతో పాటు నానికి జోడీగా నటించడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు తెలుస్తుంది. అలాగే తమిళంలో కూడా సూర్యతో చేసిన ఎన్జీకే రిలీజ్ కి రెడీ అవుతుంది..

మహానటితో జూనియర్ అతిలోక సుందరి! బీటౌన్ లో సందడి-Keerthi Suresh And Jhanvi Kapoor In Mumbai

ఇదిలా ఉంటే ఇప్పుడు కీర్తి సురేష్ బాలీవుడ్ లో కూడా అడుగుపెడుతుంది. బోనీ కపూర్ నిర్మించనున్న ఈ చిత్రంతో కీర్తి బాలీవుడ్లోకి ఎంట్రీ ఇస్తుంది. లేడీ ఓరియెంటెడ్ మూవీగా తెరకెక్కుతున్న ఈ సినిమాకి అమిత్ శర్మ దర్శకత్వం వహిస్తున్నారు.

ఇదిలా ఉంటే ఇప్పుడు కీర్తి సురేష్ ముంబై వీధుల్లో బోనీ కపూర్ కూతురు, జూనియర్ అతిలోక సుందరితో కలిసి చక్కర్లు కొడుతుంది. వారిరివురు కలిసి మీడియా ఫోటోలకి ఫోజులిచ్చారు . ఈ ఫోటో ప్రస్తుతం సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది.

శ్రీదేవి కూతురు జాన్వీ గతంలో కీర్తి సురేష్కి తాను ఫ్యాన్ అని, తన నటనే అంటే చాలా ఇష్టమని చెప్పిన నేపధ్యంలో వీళ్ళిద్దరూ ఇలా కలిసి తిరగడం ఇప్పుడు ప్రాధాన్యత సంతరించుకుంది.