తినడానికి పడుకోవడానికి వచ్చావా అని తిట్టారు.. ఇప్పుడు కెప్టెన్ అయ్యిందిగా!

తెలుగులో ప్రసారమవుతున్న బిగ్ బాస్ సీజన్ 6 అప్పుడే చూస్తుండగానే నాలుగో వారం ముగింపు దశకు చేరుకుంది.దీంతో నాలుగో వారం హౌస్ లో నుంచి ఎవరు ఎలిమినేట్ అయ్యి బయటకు వస్తారా అని ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

 Keerthi Bhat Become New Captain Of Bigg Boss 6 Telugu House, Keerthy, Bigg Boss-TeluguStop.com

తాజాగా బిగ్ బాస్ హౌస్ లో హోటల్ టాస్క్ ముగియడంతో రెండవ టాస్క్ నీ ఇచ్చాడు బిగ్ బాస్.ఆ టాస్క్ లో భాగంగా ఇంట్లో ఒక బాక్సింగ్ బ్లౌజ్ పెట్టి కంటెస్టెంట్ లకు నచ్చని వారిని టాస్క్ నుంచి తప్పించండి అని ఆదేశించాడు బిగ్ బాస్.

ఇక ఈ టాస్క్ లో భాగంగా చివరికి కీర్తి, శ్రీ సత్య సుదీప, మిగిలారు.ఈ ముగ్గురిలో బ్లాక్ బస్టర్ కెప్టెన్ ఎవరు అంటూ మరొక టాస్క్ ఇవ్వగా ఆ టాస్క్ లో అద్భుతంగా ప్రదర్శన చేసి కీర్తి భట్ బిగ్ బాస్ 4 కెప్టెన్ గా నిలిచింది.

 Keerthi Bhat Become New Captain Of Bigg Boss 6 Telugu House, Keerthy, Bigg Boss-TeluguStop.com

కాగా బిగ్ బాస్ హౌస్ కి కీర్తి ఇచ్చినప్పటి నుంచి ఆమె డల్ గా ఉంటున్న విషయం తెలిసిందే.గా చెప్పాలి అంటే హౌస్ లోకి కీర్తి ఉందా లేదా అన్న విధంగా ఆమెను తక్కువగా చూపించారు.

అంతే కాకుండా బిగ్ బాస్ హోస్ట్ నాగార్జున కూడా రెండుసార్లు సోపా వెనక్కి పంపి ఫుల్ గా క్లాస్ పీకాడు.

అయితే మొదటి నుంచి ఆమె కెప్టెన్సీ కోసం ఎంత ప్రయత్నించినా కూడా అది సాధ్యం కాలేదు.కానీ ఎట్టకేలకు కీర్తి గెలిచి చూపించింది.టాస్కుల విషయంలో ఆమెను ఎవరు ఎన్ని విధాలుగా బాధ పెట్టినా కూడా ఆమె ఆత్మవిశ్వాసంతో గేమ్ ఆడుతూ ముందుకు వచ్చింది.

అయితే చాలామంది ఈ వారం కీర్తి ఇంటి నుంచి వెళ్ళిపోతుంది అని భావించారు.కానీ ఆమె కూడా ఊహించని విధంగా ఇప్పుడు ఆమె నాలుగవ కెప్టెన్ అయింది.

మొత్తానికి వేస్ట్ అని అనిపించుకున్న కీర్తి ఇంటి సభ్యులతోనే బెస్ట్ అని అనిపించుకుంది.

Video : Keerthi Bhat Become New Captain Of Bigg Boss 6 Telugu House, Keerthy, Bigg Boss Season 6, Keerthy Bhatt, Captain #TeluguStopVideo

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube