ఆర్ఆర్ఆర్ కోసం కీరవాణి ఎంత పుచ్చుకుంటున్నాడో తెలుసా?

టాలీవుడ్‌లో తెరకెక్కుతున్న ప్రెస్టీజియస్ మల్టీస్టారర్ మూవీ ఆర్ఆర్ఆరో కోసం ప్రేక్షకులు కళ్లు కాయలు కాచేలా ఎదురుచూస్తున్నారు.ఇక ఈ సినిమా టాలీవుడ్‌తో పాటు ఇండియన్ బాక్సాఫీస్ వద్ద ఎలాంటి ప్రభంజనం సృష్టిస్తుందో అని అందరూ ఆసక్తిగా చూస్తున్నారు.

 Keeravani To Get 16 Cr For Rrr-TeluguStop.com

దర్శకధీరుడు రాజమౌళి ఈ సినిమాను పీరియాడికల్ ఫిక్షన్ సినిమాగా తెరకెక్కిస్తున్నట్లు గతంలోనే తెలిపాడు.కాగా తారక్ కొమురం భీమ్ పాత్రలో నటిస్తుండగా, చరణ్ అల్లూరి సీతారామరాజు పాత్రలో నటిస్తున్నాడు.

రాజమౌళి ప్రతి సినిమాకు సంగీతం అందిస్తున్న కీరవాణి ఈ సినిమాకు కూడా సంగీతం అందిస్తున్నాడు.ఇక ఈ సినిమాను భారీ బడ్జెట్‌తో డివివి దానయ్య ప్రొడ్యూస్ చేస్తున్నాడు.అయితే ఈ సినిమాకు సంగీతం అందించేందుకు కీరవాణి ఏకంగా రూ.16 కోట్లు వసూలు చేస్తున్నాడట.బాహుబలి సినిమాకు కీరవాణి సంగీతం ఎంతలా ఉపయోగపడిందో అందరికీ తెలిసిందే.ఇప్పుడు ఆర్ఆర్ఆర్ కోసం కూడా కీరవాణి తనదైన శైలిలో మ్యూజిక్‌ను ఇస్తున్నాడట.

ఆర్ఆర్ఆర్‌లో కథ, హీరోలు మాత్రమే కాకుండా సంగీతం కూడా సూపర్‌గా ఉంటుందని తెలుస్తోంది.ఇక ఈ సినిమాలో బాలీవుడ్ నటుడు అజయ్ దేవ్గన్ కీలక పాత్రలో నటిస్తున్నాడు.

ఆలియా భట్, ఒలివియా మారిస్ హీరోయిన్లుగా నటిస్తున్నారు.మరి ఈ సినిమాకు కీరవాణి అందించే సంగీతం ఎలా మైమరపిస్తుందో చూడాలి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube