సురేష్ ప్రొడక్షన్ లో కీరవాణి తనయుడు మూడో సినిమా

స్వర మాంత్రికుడు కీరవాణి తనయుడు అనే బ్రాండ్ తో హీరోగా తెరంగేట్రం చేసిన నటుడు శ్రీ సింహ.మత్తు వదలరా సినిమాతో హీరోగా కెరియర్ స్టార్ట్ చేసిన శ్రీ సింహా మొదటి కథనే డిఫరెంట్ జోనర్ లో ట్రై చేసి హిట్ కొట్టాడు.

 Keeravani Son Sri Simha Next Movie With Suresh Productions-TeluguStop.com

తక్కువ బడ్జెట్ తో తెరకెక్కిన ఈ సినిమా మంచి లాభాలు తీసుకొచ్చింది.రెగ్యులర్ కమర్షియల్ హీరోల మాదిరి కాకుండా తనకి సరిపోయే కథలని ఎంపిక చేసుకుంటూ శ్రీసింహ సినిమాలు చేస్తున్నాడు.

ఇక రీసెంట్ గా తెల్లవారితే గురువారం సినిమాతో ప్రేక్షకుల ముందుకి వచ్చాడు.ఈ సినిమాలో అతని నటనకి మంచి మార్కులే పడ్డాయి.

 Keeravani Son Sri Simha Next Movie With Suresh Productions-సురేష్ ప్రొడక్షన్ లో కీరవాణి తనయుడు మూడో సినిమా-Latest News - Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

కాన్సెప్ట్ బాగున్నా నేరేషన్ లో లోపాలు వలన థియేటర్ లో ప్రేక్షకులకి పెద్దగా కనెక్ట్ కాలేదు.ఇదిలా ఉంటే ఇప్పుడు శ్రీసింహ మూడో సినిమాకి రంగం సిద్ధం అవుతుంది.

ఏకంగా ఈ సినిమాని సురేష్ ప్రొడక్షన్ బ్యానర్ లో రానా నిర్మిస్తూ ఉండటం విశేషం.ఇక మధుర ఎంటర్ టైన్ మెంట్స్ తో మధుర శ్రీధర్ రెడ్డి కూడా ఈ సినిమా నిర్మాణంలో భాగం అవుతున్నాడు.

ఇప్పటికే ఈ మూవీకి సంబంధించి స్క్రిప్ట్ వర్క్ కూడా జరుగుతుందని సమాచారం. కరోనా సిచువేషన్ నార్మల్ అవగానే సెట్స్ పైకి తీసుకెళ్ళే యోచనలో ఉన్నారు.

అయితే ఈ సినిమాకి మధుర శ్రీధర్ దర్శకత్వం వహిస్తారా లేదంటే కొత్త దర్శకుడుతో ఈ సినిమాని చేస్తున్నారా అనేది తెలియాల్సి ఉంటుంది.మొత్తానికి కీరవాణి అనే బ్యాగ్రౌండ్ ఉండటంతో శ్రీసింహ ఆరంభంలోనే పెద్ద పెద్ద బ్యానర్ లలో అవకాశాలు అందుకుంటున్నాడని టాక్ టాలీవుడ్ లో వినిపిస్తుంది.

#Kala Bhairava #Madhura Sridhar #KeeravaniSon

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు