కీరవాణి కొడుకులు మత్తు వదలరా... ఆసక్తికరంగా టీజర్  

Mathu Vadalara Movie Teaser-ram Charan,teaser,tollywood

టాలీవుడ్ లో ఈ మధ్య కాలంలో సినీ వారసులు ఎక్కువగా నటులుగా పరిచయం అవుతున్నారు.ఇలా పరిచయం అవుతున్న వారిలో అతి కొద్ది మంది మాత్రమే విజయాలు సొంతం చేసుకుంటూ సొంతంగా ఇమేజ్ క్రియేట్ చేసుకుంటున్నారు.

Mathu Vadalara Movie Teaser-ram Charan,teaser,tollywood Telugu Tollywood Movie Cinema Film Latest News Mathu Vadalara Movie Teaser-ram Charan Teaser Tollywood-Mathu Vadalara Movie Teaser-Ram Charan Teaser Tollywood

ఇక ఓ విధంగా చెప్పాలంటే ఇప్పుడు టాలీవుడ్ లో ఉన్న స్టార్ హీరోలు అందరూ కూడా సినీ వారసులే.ఇప్పుడు సంగీత దర్శకుడు కీరవాణి వారసులు కూడా తమ టాలెంట్ ని ప్రూవ్ చేసుకోవడానికి రెడీ అవుతున్నారు.

పెద్ద కొడుకు కాలభైరవ సంగీత దర్శకుడుగా, చిన్న కొడుకు శ్రీ సింహ హీరోగా రితేష్ రానా అనే యువ దర్శకుడుమత్తువదలరా అనే కాన్సెప్ట్ బేస్ సినిమాని తెరకెక్కించాడు.మైత్రి మూవీ మేకర్స్, క్లాప్ ఎంటెర్టైన్మెంట్ సంయుక్తం నిర్మించిన ఈ సినిమా టీజర్ ని మెగా హీరో రామ్ చరణ్ తాజాగా రిలీజ్ చేసాడు.

ఇక టీజర్ విషయానికి వస్తే అతి నిద్ర వల్ల ఒక వ్యక్తి జీవితంలో ఎలాంటి పరిణామాలు ఎదురయ్యాయి.వాటిని అతను ఎలా పేస్ చేశాడు అనే అంశాలని చూపించబోతున్నారు.

సస్పెన్స్ థ్రిల్లర్ గా ఈ చిత్రాన్ని దర్శకుడు తెరకెక్కించాడు.ఎక్కువగా స్టోరీని నైట్ బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కించినట్లు కనిపిస్తుంది.

చూడటానికి కొత్త కాన్సెప్ట్ గానే ఉంది.ఇక కాలభైరవ అందించిన బ్యాక్ గ్రౌండ్ స్కోర్ కూడా స్టోరీ సిచువేషన్ ఎలివేట్ చేసే విధంగానే ఉంది.

టీజర్ తో ఆకట్టుకున్న ఈ సినిమా డిసెంబర్ 25న ఈ చిత్రం విడుదల కాబోతుంది.మరి కీరవాణి కొడుకు ఇద్దరు ఈ సినిమాతో జనం మత్తు ఎంత వరకు వదిలిస్తారో అనేది వేచి చూడాలి

తాజా వార్తలు