పూజ గదిలో ఈ వస్తువులను పెడుతున్నారా.. అయితే అశుభాన్ని వెంట తెచ్చుకున్నట్లే..!

పూజ గది( Pooja Room ) అంటే ఎప్పుడూ ప్రశాంతంగా ఉంటుంది.దైవం కోలువై ఉండే ఈ ప్రాంతాన్ని అనవసరమైన వస్తువులతో నింపకూడదు.

అలా చేయడం వల్ల లేనిపోని దోషాలు కలుగుతాయి.దేవుడి గది దగ్గర ఏ ఏ వస్తువులు ఉంచకూడదో ఇప్పుడు తెలుసుకుందాం.

ఒక ఇంటికి దేవుడి గది ఎంతో ప్రత్యేకమైనది.పాజిటివ్ ఎనర్జీ( Positive Energy ) ఇక్కడ నుంచి జనరేట్ అయ్యి ఇల్లంతా వ్యాపిస్తుంటుంది.

అందుకే ఈ గదిలో నెగిటివ్ వస్తువులను అసలు ఉంచకూడదు.అలా చేయడం వల్ల దాని ప్రభావం సంపద రాబడి మీద పడడంతో పాటు మనశ్శాంతి కూడా దూరం అవుతుంది.

Advertisement

ముఖ్యంగా చెప్పాలంటే పూజగది ఇంటికి ఈశాన్య దిశలో ఉంటుంది.పూజ చేసే వారి ముఖం తూర్పు వైపుకు లేదా ఉత్తరం వైపుకు ఉండాలి.దక్షిణం లేదా పడమర వైపు ఉండడం అసలు మంచిది కాదు.

పూజలో వాడిన పూజ ద్రవ్యాలు, పూలు( Pooja Flowers ) మరుసటి రోజు తప్పనిసరిగా తీసివేయాలి.వీటిని నైర్మల్యం అంటారు.ఈ నైర్మల్యం చెత్తలో వేయకూడదు.

వీటన్నిటినీ సేకరించి తప్పనిసరిగా ప్రవహించే నీటిలో వదిలేయాలి.దీపం( Pooja Lamp ) వెలిగించి ఒత్తి పూర్తిగా కాలే వరకు వెలిగేలా చూసుకోవాలి.

ఒక వేళ ఏదైనా కారణంతో దీపం కొండెక్కితే తిరిగి అదే దీపం వెలిగించకూడదు.

అల్లంతో అధిక హెయిర్ ఫాల్ పరార్.. ఎలా వాడాలంటే?
అదృష్టాన్ని తెచ్చే దేవుడు ముందు దీపం వెలిగించడానికి.. ఈ నియమాలు పాటించండి..!

ప్రతిరోజు దీపపు కుందులు శుభ్రం చేయాలి.అలాగే దేవుని కి సమర్పించిన ప్రసాదం( Prasadam ) తప్పనిసరిగా స్వీకరించాలి.వాటిని అలాగే వదిలేసి మర్చిపోకూడదు.

Advertisement

అలా చేయడం వల్ల దైవ ప్రసాదాన్ని చులకన చేసినట్లు అవుతుంది.పూజ గదిలో విరిగిపోయిన విగ్రహాలు ఉండకూడదు.

వీటికి పూజ చేస్తే నెగిటివ్ ఎనర్జీ( Negative Energy ) వస్తుంది.చిరిగిపోయిన పూజా పుస్తకాలు పూజా గదిలో ఉంటే ప్రవహించే నీటిలో వదిలేయాలి.

అక్షింతలుగా ఎప్పుడూ నూకల బియన్ని వాడకూడదు.అలాగే రౌద్ర రూపంలో ఉండే దేవి లేదా దేవునికి సంబంధించిన చిత్రపటాలు పూజ గదిలో ఉండకూడదు.

తాజా వార్తలు