ఏదైనా సంతకం పెట్టేటప్పుడు ఇవి గమనించండి.. లేదంటే బుక్కయిపోతారు?

సంతకం అనేది మన వ్యక్తిత్వానికి సంకేతం వంటిదని కొందరు అంటూవుంటారు.అంటే మన సంతకాన్ని బట్టి కొంతమంది మనం ఎలాంటివారమో చెప్పేస్తారు.

 Keep These Things In Mind While Signing Anything Or You Will Get Booked , Signat-TeluguStop.com

ఇక సంతకం పెట్టడంలో ఒక్కొక్కరికి ఒక్కో స్టైల్ ఉంటుంది.కొంతమంది వారి పూర్తి పేరును సంతకంగా పెడితే, మరికొందరు షార్ట్ కట్ లో సంతకాన్ని పెడుతూ వుంటారు.

అయితే సంతకం అనేది సులువుగా ఉంటే సులువుగా కాపీ చేసే ప్రమాదం ఉంది.దీంతో సంతకం అర్థం కాకుండా పెట్టడం కూడా ఒక ఆర్ట్ అని చెప్పుకోవాలి.

అంటే సంతకం పెట్టడం అనేది కూడా ఒక కల అంటారు చాలా మంది.

ఇకపోతే ఈ సంతకాలు కూడా మన భవిష్యత్తుపై ప్రభావం చూపుతోందంట? అదెలా అంటే, కొంత మంది తమ సంతకం చేసే క్రమంలో తెలుగు అక్షరాలతో పేరు రాస్తే, మరికొందరు తెలుగు ఇంగ్లీష్ రెండు అక్షరాలు కలిపి సంతకం చేస్తుంటారు.ఇక కొంత మంది సంతకం చేసే క్రమంలో మొదటి అక్షరాన్ని పెద్దగా రాసి చివరి అక్షరం చిన్నాగా రాసి చివరకు ఒక చుక్కపెడుతుంటారు.అయితే.ఇలా సంతకం పెడితే అది జీవితంపై ఎలాంటి ప్రభావం చూపుతుందో ఇప్పుడు తెలుసుకుందాం.ఒక వ్యక్తి తన సంతకంలో పేరులోని మొదటి అక్షరాన్ని రాసి.

పేరుకు దిగువన చుక్క వేస్తే.అలాంటి వ్యక్తి ధనవంతుడవుతాడని, వారు ఆర్థికంగా కూడా బలపడే అవకాశం ఎక్కువగా ఉంటుందని నిపుణులు తెలుపుతున్నారు.

Telugu Guiter, Important, Signature, Tips, Latest-Latest News - Telugu

అలాగే మనం ఎక్కడ పడితే అక్కడ మన సంతకాలు చేసేయకూడదు.అలా చేసిన యెడల లేనిపోని కష్టాలు వస్తాయని చెబుతున్నారు కొంతమంది.ముఖ్యంగా ఖాళీ పేపర్స్ పైన (తెల్ల కాగితం) అస్సలు సంతకం చేయకూడదని చెబుతున్నారు.అలా చేసిన యెడల దానిని కొంతమంది ఆసరాగా తీసుకొని మన దగ్గర డబ్బులు గుంజే అవకాశం ఉందని అంటున్నారు.

ఎందుకంటే ఇలాంటి ఘటనలు మన చుట్టూ ఎన్నో జరుగుతున్నాయి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube