వేసవి నుండి 'కూల్‌ రూఫింగ్‌' ఏ మేరకు కాపాడుతుంది.. అది అందరికి సాధ్యమేనా?

ఎండలు మండి పోతున్నాయి.మే నెల పోయి జూన్‌లోని ప్రవేశించాం.

 Keep Buildings Cool In Summer With Cool Roofs-TeluguStop.com

జూన్‌ నెలలో రుతుపవనాలు వస్తాయి.అవి వచ్చే వరకు ఉక్కపోత మరియు ఎండలు తప్పవు.

ఈ జూన్‌ లో కూడా కనీసం రెండు వారాలు అయినా ఎండలతో బాబోయ్‌ అనాల్సిందే.అయితే ఎండల నుండి ఉపశమనం పొందేందుకు చాలా మంది చాలా ప్రయత్నాలు చేస్తూ ఉంటారు.

ముఖ్యంగా ఇంటి పై కప్పు విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకుంటూ ఉంటారు.స్లాబ్‌ ఇల్లు వారు తమ ఇంటిని చల్లగా ఉంచుకునేందుకు కిందా మీదా పడుతూ ఉంటారు.

వేసవి నుండి 'కూల్‌ రూఫింగ్‌' ఏ

కొందరు స్లాబ్‌పై గడ్డి వేస్తారు, మరి కొందరు నీటిని నిల్వ ఉంచుతారు మరి కొందరు కూల్‌ రూఫింగ్‌ చేయిస్తారు.ఈ కూల్‌ రూఫింగ్‌ అనేది ఈమద్య కాలంల బాగా ఫేమస్‌ అవుతోంది.కూల్‌ రూఫింగ్‌ వల్ల గది ఉష్ణోగ్రత మరీ అధికంగా ఉండకుండా ఉంటుంది.బయట ఎంత వేడి ఉన్నా కూడా గదిలో మాత్రం కాస్త చల్లగానే ఉంటుంది.కూల్‌ రూఫింగ్‌ అంటే స్లాప్‌ పై వైట్‌ పెయింట్‌ అప్లై చేయడం.సాదారణ పెయింట్‌ కాకుండా కాస్త విభిన్నంగా ఉండే పెయింట్‌ అది.ప్రస్తుతం అధికంగా వినియోగిస్తున్న నేపథ్యంలో ఉత్పత్తి ఎక్కువ అయ్యి రేటు కూడా కాస్త తగ్గిందని చెప్పుకోవాలి.

వేసవి నుండి 'కూల్‌ రూఫింగ్‌' ఏ

తెల్ల రంగును స్లాబ్‌పై వేయడం వల్ల సూర్య కాంతి పరావర్తనం చెంది ఉష్ణోగ్రత తగ్గుతుంది.ఇలా తగ్గడంతో లోపలి వాతావరణం చల్లగా ఉంటుంది.ఉదాహరణకు బయట 50 డిగ్రీల వరకు ఉష్ణోగ్రత ఉంటే రూం వాతావరణం 30 నుండి 35 వరకు ఉండవచ్చు.

ఇలా రూం వాతావరణంను చల్లబర్చుకునేందుకు మరియు స్లాప్‌ ఎక్కువ కాలం మన్నిక కోసం కూడా ఈ కూల్‌ రూఫింగ్‌ను వాడతారు.అనేక మంచి ఉపయోగాలు ఉన్న కూల్‌ రూఫింగ్‌ భవిష్యత్తులో మంచి డిమాండ్‌ ఉంటుందని మార్కెట్‌ నిపుణులు చెబుతున్నారు.

కూల్‌ రూఫింగ్‌ పెయింటింగ్స్‌లో రకాలు చాలా ఉన్నాయి.మంచి రూఫింగ్‌ పెయింట్‌కు కాస్త ఎక్కువ ఖర్చు అవుతుంది.

అలాగే ఎక్కువ చల్లదనం మరియు మన్నిక కూడా వస్తుంది.ఈసారికి వదిలేసినా వచ్చే ఏడాదికి అయినా మీ ఇంటికి కూల్‌ రూఫింగ్‌ను వాడండి.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube