మా అమ్మాయిలకు నేనిచ్చే సలహా ఇదే.. ఏఆర్ రెహమాన్ కామెంట్స్ వైరల్!

ప్రముఖ భారతీయ సంగీత దర్శకులలో ఒకరైన ఏఆర్ రెహమాన్ రోజా సినిమాతో సినిమాలకు సంగీత దర్శకుడిగా కెరీర్ ను మొదలుపెట్టి తొలి సినిమాతోనే జాతీయ పురస్కారం అందుకున్నారు.తన సంగీతం ద్వారా తెలుగుతో పాటు ఇతర భాషల్లో ఏఆర్ రెహమాన్ పాపులారిటీని పెంచుకున్నారు.

 Keep Advising My Daughters Do Not Stress Over Being Compared Says Ar Rahman, Ar-TeluguStop.com

తన ప్రతిభతో ఏఆర్ రెహమాన్ రెండు ఆస్కార్ అవార్డులను సైతం సొంతం చేసుకోవడం గమనార్హం.

నాలుగు సంవత్సరాల వయస్సులోనే రెహమాన్ తన తండ్రి దగ్గర పియానో నేర్చుకున్నారు.

తల్లి సూచనల మేరకు రెహమాన్ చదువు మానేసి సంగీతంపై దృష్టి పెట్టారు.రాజ్ కోటి దగ్గర అసిస్టెంట్ గా రెహమాన్ తన కెరీర్ ను మొదలుపెట్టారు.

జాతీయ స్థాయిలో ఉత్తమ సంగీత దర్శకుడిగా ఏఆర్ రెహమాన్ కు నాలుగుసార్లు అవార్డులు దక్కాయి.తెలుగులో తక్కువ సినిమాలకు ఏఆర్ రెహమాన్ సంగీతం అందించారు.

Telugu Ar Rehman, Daughters, Katija, Reheema-Movie

రెహమాన్ ఇద్దరు కూతుళ్లు ఖతీజా, రెహీమా సంగీతకారులుగా కెరీర్ విషయంలో రాణిస్తున్నారు.కెరీర్ పరంగా, వ్యక్తిగత విషయాలకు సంబంధించి కూతుళ్లకు ఏవైనా సలహాలు ఇస్తారా? అనే ప్రశ్నకు ఏఆర్ రెహమాన్ స్పందిస్తూ నా ఇద్దరు కూతుళ్ల మనస్తత్వం మొండి మనస్తత్వం అని వాళ్లు ది బెస్ట్ ఇవ్వాలని అనుకుంటారని ఏఆర్ రెహమాన్ చెప్పుకొచ్చారు.దేని గురించి దిగులు చెందవద్దని చేయాలనుకున్న పనిని చేయాలని తాను చెబుతానని ఏఆర్ రెహమాన్ తెలిపారు.

Telugu Ar Rehman, Daughters, Katija, Reheema-Movie

అలా చేస్తే మాత్రమే సొంత వ్యక్తిత్వం అలవడుతుందని ఇతరులతో పోల్చుకోవద్దని తాను కూతుళ్లకు చెబుతానని ఏఆర్ రెహమాన్ పేర్కొన్నారు.పని పట్ల నిబద్ధత అనే విషయాన్ని తాను నేర్చుకుంటూ ఉన్నానని ఏఆర్ రెహమాన్ చెప్పుకొచ్చారు.యువతలో ఉండే ఉత్సాహం నన్ను ప్రేరేపిస్తుందని వాళ్లతో కలిసి పని చేసే సమయంలో అప్పటి క్షణాలను ఆస్వాదిస్తానని ఏఆర్ రెహమాన్ చెప్పుకొచ్చారు.

ఏఆర్ రెహమాన్ చేసిన కామెంట్స్ నెట్టింట వైరల్ అవుతున్నాయి.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube