కెఈ ... `దేశ` బ‌హిష్క‌ర‌ణ ?  

Ke Prabhakar Suspend From Tdp ?-

పదవులు కావాలంటే సమయం వచ్చేవరకు వేచి ఉండాల్సిన నేత‌లు ధ‌ర్నాల‌కు దిగ‌టం స‌రికాదంటూ ఉపముఖ్యమంత్రి కేఈ కృష్ణమూర్తి వ్యాఖ్యానించారు.క‌ర్నూలు జి్ల్లాకు చెందిన టీజీ వెంకటేశ్‌కు రాజ్యసభ సీటు కేటాయించడాన్ని నిరసిస్తూ టిడిపి జిల్లా పార్టీ ప్రధాన కార్యాలయం ఎదుట ఆందోళనకు దిగిన కేఈ ప్రభాకర్‌పై చ‌ర్య‌లు తీసుకోవాల‌ని తెలుగుదేశం పార్టీ అధిష్టానం యోచిస్తున్న‌ట్టు క‌థ‌నాలు వ‌స్తున్న నేప‌థ్యంలో శుక్ర‌వారం ఆయ‌న మీడియాలో తెలుగుదేశం పార్టీ క్రమశిక్షణకు మారుపేరని… పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడితే సొంత తమ్ముడైనా… కుమారుడైనా ఉపేక్షించేది లేదని హెచ్చరిక‌లు ఈ విష‌యాన్ని దాదాపు ఖ‌రారు చేసేలా ఉన్నాయ‌ని రాజ‌కీయ ప‌రిశీల‌కులు భావిస్తున్నారు.

బీసీల విష‌య‌మై పార్టీలో అన్యాయం జ‌రుగుతోందంటూ త‌న సోద‌రుడు కేఈ.ప్రభాకర్‌ విమర్శలపైనా ఆయ‌న స్పందిస్తూ, బీసీల భుజాల‌పై పుట్టిన పార్టీ తెలుగుదేశం పార్టీ అనే విష‌యం గ‌మ‌నించాల‌ని , తప్పు చేస్తే బంధువైనా.

Ke Prabhakar Suspend From Tdp ?- తాజా తెలుగు ఆంధ్ర ,తెలంగాణ రాజకీయ పొలిటికల్ బ్రేకింగ్ వార్తలు ..ఎలక్షన్ రిజల్ట్స్ విశ్లేషణలు ,రాజకీయ నాయకుల వివరాలు ..కధనాలు --

సోదరుడైనా సరే పార్టీ తగిన రీతిలో స్పందిస్తుందన్నారు.త‌ప్పుడు ఆరోప‌ణ‌లపై ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు చర్యలు తీసుకుంటారని చెప్పారు

కాగా కేఈ.

ప్రభాకర్ సస్పెండ్‌ చేసే యోచనలో ముఖ్య‌మంత్రి ఉన్నట్లు సమాచారం.పార్టీకి న‌ష్టం క‌లిగించేలా వ్య‌వ‌హ‌రించే వారు ఎంత సీనియ‌ర్ల‌యినా వ‌దులుకునేందుకు సిద్ద‌మేన‌ని హెచ్చ‌రిక‌లు చేసేందుకు ఈ వ్య‌వ‌హారంపై దృష్టి సారించాల‌ని ఎపి టిడిపి అధ్య‌క్షుడు కిమిడి క‌ళావెంక‌ట‌రావుకు ఆదేశాలిచ్చిన‌ట్లు తెలియ వ‌స్తోంది.

.

తాజా వార్తలు