చంద్రబాబు కి భారీ షాక్..వైసీపిలోకి ఉపముఖ్యమంత్రి..?

ఏపీ సీఎం చంద్రబాబు కి బ్యాడ్ టైం స్టార్ట్ అయినట్టు ఉంది.జగన్ పాదయాత్రతో దూసుకుపోతుంటే చంద్రబాబు పాదయాత్ర కి ధీటుగా ప్రభుత్వ పధకాల అమలుని బేస్ చేసుకుని ప్రచార యాత్ర చేపట్టాలి అనుకున్నాడు.

 Ke Krishnamurthy Ready To Join Ysrcp-TeluguStop.com

జగన్ పార్టీలో కీలక నేతలని తెలుగుదేశం లోకి ముందు ఆహ్వానించి చాలా మందికి పచ్చ కండువా కప్పినా జగన్ పాదయాత్ర ముందు అవన్నీ వీక్ అయ్యిపోయాయి .అయితే ఇప్పుడు దెబ్బకి దెబ్బ అనేట్టుగా చంద్రబాబు వేలితో తన కళ్ళనే పొడుచుకునే విధంగా ఒక పక్కా ప్లాన్ వేశాడు.ప్లాన్ చంద్రబాబుదే కానీ ఫలితం మాత్రం జగన్ కి దక్కేలా ఉంది.

రాజకీయాల్లో ఎప్పుడు ఏదన్నా జరుగచ్చు అనడానికి ఇదే పెద్ద ఉదాహరణ.ఇంతకీ అసలు విషయం ఏమిటంటే…గడిచిన నాలుగేళ్ళుగా పార్టీలో ఉంటూ పార్టీలో కీలక పదవులు అందుకుంటూ ఎంతో సీనియర్ నాయకుడిగా తెలుగుదేశం లో ఉన్న నేత.ఉపముఖ్యమంత్రి కేఈ కృష్ణమూర్తి.పార్టీలో మంత్రి పదవికూడా అలంకరిస్తూ ఉన్న కేఈ త్వరలో పార్టీని వీడబోతున్నారు అనే వార్త రాజకీయ వర్గాలలో పెను సంచలనం సృష్టించబోతోంది.ఏకంగా తెలుగుదేశం పార్టీ ఉపముఖ్యమంత్రి పార్టీ మారాలని అనుకోవడం చంద్రబాబు కి కోలుకోలేని దెబ్బ అని చెప్పవచ్చు.

అయితే కేఈ తెలుగుదేశం పార్టీని వీడి వైసీపిలోకి వెళుతున్నారు అనే వార్తలు ఏపీ రాజకీయాల్లో హాట్ టాపిక్ అయ్యాయి.కేఈ కృష్ణమూర్తి కొన్ని రోజుల క్రితం మాట్లాడుతూ చంద్రబాబు గనుకా కాంగ్రెస్ కి వెళ్తే నేను ఉరి వేసుకుంటా అని సంచలన వ్యఖ్యలు చేశారు.

ఈ క్రమంలోనే గతంలో కేఈ కి చంద్రబాబు లోకేష్ లపై ఉన్న అసంతృప్తి ని ఈ విధంగా వ్యక్తపరిచారు.అంతేకాదు కర్నూలు జిల్లా ఎమ్మెల్యేలు కూడా టీడీపీ జెండాతో వచ్చేసారి ఎన్నికలకు వెళితే ఓట్లు పడవేమో అన్న ఆందోళనలో ఉన్నారట.

అందుకే ఉపముఖ్యమంత్రి పోస్టులో ఉండి కూడా కేఈ ఇలాంటి వ్యాఖ్యలు చేస్తున్నారని అంటున్నారు.గతంలోనూ కేఈ వేరే పార్టీలతో సంప్రదింపులు జరిపినట్టు టాక్ ఉంది.అయితే కేఈ గత కొంతకాలంగా టీడీపీలోని వ్యతిరేకతను బాహాటంగానే బయట మాట్లాడుతున్నారు.ఈ వ్యాఖ్యలు వైసీపికి బలాన్ని చేకూరుస్తున్నాయి అనడంలో సందేహం లేదు అంటున్నారు అయితే కేఈ ఈ విధంగా మాట్లాడటానికి కారణం తనకి మంత్రి పదవి ఇచ్చినా సరే ఆ పదవిలో కేఈ ఉశ్చవ విగ్రహంలా మారి పోయారు తప్ప తన నిర్ణయానికి అక్కడ విలువలేదు.

ఆయన శాఖలో పని జరిపించికోవాలి అంటే చంద్రబాబు లోకేష్ లు ఒకే చెప్పాల్సిందే అంట.దాంతో కొంత కాలంగా ఎంతో కోపంతో రగిలిపోతున్న కే ఈ త్వరలో పార్టీని వీడనున్నారని ఆయన అసంతృప్తి ని వైసీపి తెలివిగా క్యాష్ చేసుకుందని అంటున్నారు.ఏది ఏమైనా సరే కేఈ గనుకా తెలుగుదేశం పార్టీని వీడితే చంద్రబాబు కి తీవ్రనష్టం జరగడం మాత్రం ఖాయం అంటున్నారు విశ్లేషకులు .

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube