ఆ పని చేసినందుకు కేసీఆర్ కి నోబెల్ బహుమతి ఇవ్వాలంటా  

Kcr Should Get Nobel Prize Says Bipin Chandra-

ప్రపంచ వ్యాప్తంగా పెరిగిపోతున్న కాలుష్యం, వాతావరణంలో మార్పుల కారణంగా వర్షాలు సకాలంలో పడటం లేదు.మరో వైపు భూమి మీద కూడా బోర్లు వేసి ఇష్టారాజ్యంగా లొపలి నుంచి నీరు తోడేస్తున్నారు.ఈ కారణంగా అంతకంతకు భూగర్భ జలాలు తగ్గిపోతున్నాయి...

Kcr Should Get Nobel Prize Says Bipin Chandra--KCR Should Get Nobel Prize Says Bipin Chandra-

ఇప్పటికే ప్రపంచలో పర్యావరణ వేత్తలు ఈ వాతావరణ మార్పులు తరిగిపోతున్న భూగర్భ జలాలపై ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.భవిష్యత్తులో మూడో ప్రపంచ యుద్ధం అంటూ వస్తే నీటి కోసం వస్తుందని ఇప్పటికే చాలా మంది ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.పర్యావరణం కాపాడుకొని నీటి వనరులని పెంచుకోవాలని సూచనలు ఇస్తున్నారు.

ఇక తెలంగాణలో ముఖ్యమంత్రి కేసీఆర్ భవిష్యత్తులో తెలంగాణాకి రాబోయే నీటి కష్టాలు ముందే గ్రహించి కాళేశ్వరం ప్రాజెక్ట్ రూపకల్పన చేసారు.ఊహించని విధంగా అతి కొద్ది టైంలోనే ఈ ప్రాజెక్ట్ ని ప్రజలకి అందుబాటులోకి తీసుకొచ్చి జాతికి అంకితం చేసారు.ఇక ఈ కాళేశ్వరం ప్రాజెక్ట్ రీ డిజైనింగ్ పై ఇప్పటికే చాలామంది అతనిని ప్రశంసలతో ముంచెత్తారు.

Kcr Should Get Nobel Prize Says Bipin Chandra--KCR Should Get Nobel Prize Says Bipin Chandra-

తాజాగా జలశక్తి అభియాన్ కేంద్ర కమిటీ జాయింట్ సెక్రటరీ బిపిన్ చంద్ర కేసీఆర్ ను ఉద్దేశించి తెలంగాణ ప్రజలకి గుర్తుండిపోయే మాట చెప్పారు.భవిష్యత్తులో తలెత్తే నీటి సమస్యని ముందే గుర్తించి అలా జరగకుండా ఉండేందుకు వీలుగా కేసీఆర్ చేపట్టిన ప్రాజెక్టు కాళేశ్వరం అద్బుతం అని అన్నారు.చాలా దూరదృష్టితో వ్యవహరించి తెలంగాణ జాతిని యుద్ధాల బారిన పడకుండా చేసిన కేసీఆర్ కి కచ్చితంగా నోబెల్ బహుమతి ఇవ్వాలని బిపిన్ చంద్ర పొగడటం ఇప్పుడు ఆసక్తికరమైన చర్చకి దారితీసింది.