కేసీఆర్ ఫ్రంట్ అట్టర్ ఫ్లాప్..రీజన్ ఇదేనా..?

దేశంలో మరో సారి అధికారం చేపట్టాలి మళ్ళీ ప్రధాని అవ్వాలని అనుకున్న మోడీ అందుకు తగ్గట్టుగా రచిస్తున్న వ్యూహాలు ఊహలకి కూడా అందటం లేదు.బహుశా తలపండిన రాజకీయ నాయకులకి విశ్లేషకులకి సైతం మోడీ విధానాలు చూసి మైండ్ బ్లాక్ అవ్వాల్సిందే అంటున్నారు.

 Kcrs Third Front An Utter Flop-TeluguStop.com

అయితే తాజాగా వస్తున్న వార్తల ప్రకారం గత కొన్ని నెలలుగా కేసీఆర్ రాష్ట్రాలు తిరుగుతూ ఫెడరల్ ఫ్రంట్ అంటున్న ప్లాన్ అంతా పక్కా బీజేపి వ్యూహం ప్రకారం జరిగింది అంటున్నారు.ఇదే చర్చ ఇప్పుడు రాజకీయ వర్గాలలో తీవ్ర కలకలం రేపుతోంది.

కేసీఆర్ కి ఫెడరల్ ఫ్రంట్ ఏర్పాటు చేసి మోడీ ని ఎదుర్కునే శక్తి ఉందంటే ఎవరూ నమ్మరు.మరి అలాంటిది ఏ ఉద్దేశ్యంతో కేసీఆర్ ముందుకు నడిచాడు ఎవరి అండదండలతో అడుగులు వేశారు అనేదానికి సీపీఐ నాయకుడు సురవరం సుధాకరరెడ్డి ఒక వివరణ ఇచ్చారు.దాంతో అప్పటి వరకూ కేసీఆర్ పై కాస్తో కూస్తో ఇదే ధర్మ సందేహం ఉన్న వాళ్ళు సైతం అవును ఇదే వాస్తవం అంటూ ఫిక్స్ అయిపోయారు.అయితే ఈ వార్తల్లో ఎతవరకూ నిజంఉందో తెలియదు కానీ.

మోడీ నే కేసీఆర్ ని నడిపిస్తున్నాడు అనే వార్త మాత్రం హల చల్ అవుతోంది.

అయితే కేసీఆర్ తానూ ఫెడరల్ ఫ్రంట్ ఏర్పాటు చేసుకుని ఆ ఫ్రంట్ ని లీడ్ చేస్తూ కేంద్రంలో ప్రత్యామ్నాయ రాజీయ వ్యవస్థని తీసుకుని రావాలని అనుకున్నాడు అందులో బాగంగానే కేసీఆర్ అన్ని రాష్టాల ప్రతినిధులతో భేటీ అయ్యాడు కూడా…అయితే కేసీఆర్ కి ఊహించని విధంగా ఎవరి నుంచీ కూడా స్పందన రాలేదు.

దాంతో చంద్రబాబు ని కేంద్రంలో డామినేట్ చేయాలనీ అనుకున్న కేసీఆర్ ఆశలు ఆవిరి అయ్యిపోయాయి.సరే కేసీఆర్ అట్టర్ ఫ్లాప్ అయ్యాడు అనుకున్న సమయంలో సురవారం సుధాకర్ రెడ్డి వ్యాఖ్యలు ఇప్పడు సంచలనం అవుతున్నాయి.

ఆయితే దానికి సురవరం రీజన్ కూడా చెప్పారు.కేంద్రంలో మోడీ సర్కార్ ని గద్దె దించాలి అని ఏనాడు కేసీఆర్ మాట్లాడలేదు సరికదా కేంద్రంతో రాసుకు పూసుకుని మాత్రం తిరుగుతూ ఉన్నారు.

అంతేకాదు కేసీఆర్ అనుచరగణం కానీ తన బంధవులు కానీ కేంద్రానికి వ్యతిరేకంగా మాట్లాడిన సందర్భాలు కూడా చాలా తక్కువ.అయితే ఫ్రంట్ విషయం పక్కన పెట్టిన తరువాత కూడా కేసీఆర్ సైలెంట్ గానే ఉన్నారు తప్ప మోడీ పై ఒక్క విమర్శ చేయలేదు దాంతో సురవరం మాటలు ఇప్పుడు కేసీఆర్ ప్రవర్తిస్తున్న తీరుకు సరిగ్గా అతికినట్టుగా ఉన్నాయి అంటున్నారు.

ఏది ఏమైనా కేసీఆర్ ఫ్రంట్ అట్టర్ ఫ్లాప్ అవ్వడానికి కారణం కేసీఆర్ మోడీ లాలుచీనే అంటున్నారు విశ్లేషకులు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube