ప్రతిపక్షాల దూకుడు పట్ల కేసీఆర్ మౌనం...అసలు వ్యూహం ఇదే?

తెలంగాణ ఏర్పడిన నాటి నుండి పోలిస్తే అప్పటి రాజకీయ పరిస్థితులకు, ఇప్పటి రాజకీయ పరిస్థితులకు పెద్ద ఎత్తున తేడా ఉంది.తెలంగాణ ఏర్పడిన తరువాత టీఆర్ఎస్ కు ప్రత్యామ్నాయంగా ఏ ఒక్క పార్టీకూడా లేకపోయింది.

 Kcr's Silence On The Aggression Of The Opposition ... Is This The Real Strateg K-TeluguStop.com

కాని ఇప్పుడు పరిస్థితి మాత్రం పూర్తి భిన్నంగా తయారయింది.అయితే ప్రస్తుత రాజకీయాలలో తలపండిన రాజకీయ నాయకులలో కెసీఆర్ ఒకరు.

ఎప్పుడు ఎలా వ్యూహాన్ని పన్నాలి, ఎప్పుడు ఎటువంటి ప్రకటన చేయాలనే దానిపై కెసీఆర్ కు ఉన్న క్లారిటీ ఎవరికీ లేదు.అయితే రెండు దఫాలు టీఆర్ఎస్ ప్రభుత్వం ఏర్పడిన తరువాత ప్రతి పక్షాలు టీఆర్ఎస్ కు కనీసం పోటీ ఇవ్వలేని పరిస్థితిలో ఉన్న విషయం తెలిసిందే.

అయితే ఈ సారి కూడా టీఆర్ఎస్ ప్రభుత్వం ఏర్పడితే ఇక ప్రతిపక్షాలు రాజకీయంగా కోలుకోవడం చాలా కష్టం.

అందుకే పెద్ద ఎత్తున ఇటు కాంగ్రెస్ పార్టీ కావచ్చు, బీజేపీ కావచ్చు దూకుడు ప్రదర్శిస్తున్నాయి.

అయితే ఇంతలా ప్రతిపక్షాలు దూకుడు ప్రదర్శిస్తున్నా కెసీఆర్ మాత్రం ఇప్పటి వరకు కెసీఆర్ స్పందించిన పరిస్థితి లేదు.ఎందుకంటే ప్రజలు ప్రస్తుతం ప్రభుత్వం నుండి ఏమి ఆశిస్తున్నారనే దానిపై దృష్టి పెట్టడం ద్వారా ప్రజల్లో మరింత బలంగా తయారయ్యే అవకాశం ఉంది.

అప్పుడు ప్రజలు ప్రతిపక్షాల మాటలకు ప్రాధాన్యం ఇవ్వకుండా ప్రభుత్వం పట్ల సానుకూల దృక్పధం కలిగి ఉంటారనేది కెసీఆర్ వ్యూహంలా కనిపిస్తోంది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube