అవతరణ కానుకగా ఉద్యోగాలు...!

పండుగల సమయంలో కానుకలు ఇవ్వడం సంప్రదాయం.పండుగలంటే ఉగాది, దసరా, దీపావళి…ఇవే కాదు.

 Kcr’s Gift To Telugus On Telangana Formation Day-TeluguStop.com

స్వాతంత్ర్య దినోత్సవం, రిపబ్లిక్‌డే మొదలైనవి కూడా పండుగలే.ఆ సందర్భంగా ప్రభుత్వాలు ప్రజలకు కానుకలు ఇస్తుంటాయి.

కానుకలు ఇవ్వడమంటే ప్రతి ఒక్కరికి ఏదో ఒక వస్తువు ఇవ్వడం కాదు కదా…! ప్రజలకు ప్రయోజనం కలిగించే కొన్ని నిర్ణయాలు ప్రకటిస్తాయి.లేదా పథకాలు ప్రవేశపెడతాయి.

వచ్చే నెల రెండో తేదీన తెలంగాణ రాష్ర్ట అవతరణ దినోత్సవం జరగబోతోంది.దీన్ని ధూంధాంగా చేయాలని టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం నిర్ణయిచింది.

ఇది మొదటి రాష్ర్ట అవతరణ దినోత్సవాలు కాబట్టి ఘనంగా నిర్వహించబోతున్నారు.వారం పాటు ఉత్సవాలు జరపాలని ప్రభుత్వం నిర్ణయించింది.

ఈ సందర్భంగా సీఎం కేసీఆర్‌ తెలంగాణ ప్రజలకు విలువైన కానుకలు ఇవ్వాలనుకున్నారు.అన్ని వర్గాల ప్రజలకు కానుకలు ఇచ్చి సంతోషపెట్టాలనుకున్నారు.

ఈ విషయం అన్ని ప్రభుత్వ శాఖలకు చెప్పి ఏం కానుకలు కోరుకుంటున్నారో కనుక్కోమని ఆదేశించారట.అన్ని శాఖల అధికారులు కానుకల విషయమై తెలుసుకుంటే వారికి వచ్చిన జవాబు ఏమిటంటే…’ఉద్యోగాలు తప్ప మరే కానుకలు వద్దు’ అని.ఉద్యోగాలంటే ప్రభుత్వ ఉద్యోగాలని అర్థం.అవయితేనే జీవితానికి భద్రత ఉంటుంది కదా.మరి కేసీఆర్‌ ఈ కానుక ఇస్తారా? ఎందుకంటే ఉద్యోగాల ఆశ చూపి అధికారంలోకి వచ్చిన తరువాత ఇప్పటివరకు ఒక్క నోటిఫికేషన్‌ కూడా విడుదల కాలేదు.

.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube