విమర్శలతో యాదాద్రి శిల్పాల్లో మార్పులు

తెలంగాణ రాష్ట్రంలోనే అతి పెద్ద ఆద్యాత్మిక కేంద్రంగా నిర్మాణం జరుగుతున్న లక్ష్మినరసింహ స్వామి దేవాలయంలోని కీలకమైన మండపంలో శిల్పాలపై కేసీఆర్‌ చిత్రపటం మరియు టీఆర్‌ఎస్‌ పార్టీ ప్రవేశ పెట్టిన కొన్ని పథకాలకు సంబంధించిన విషయాలను చెక్కడం జరిగింది.దాంతో రాజకీయ దుమారం చెలరేగింది.

 Kcrs Face Partysymbol Appear On Yadadri Temple-TeluguStop.com

ఈ విషయమై బీజేపీ నాయకులతో పాటు కాంగ్రెస్‌ పార్టీ నాయకులు ఇంకా పలు సంఘాల వారు ఆందోళనలు చేయడం మొదలు పెట్టారు.దాంతో అధికారులు వెనక్కు తగ్గినట్లుగా తెలుస్తోంది.

రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలకు సంబంధించిన పేర్లను తొలగించాలని నిర్ణయించారు.

ఇప్పటికే తెలంగాణకు హరిత హారం అంటూ ఉన్న పేరును తొలగించడంతో పాటు, కేసీఆర్‌ కిట్‌ అంటూ ఉన్న పదాలను కూడా తొలగించారు.

ఆ చిత్ర పటాలను మాత్రం అలాగే ఉంచారు.వాటిని తొలగిస్తారా లేదా అనే విషయమై ఇంకా ఎలాంటి క్లారిటీ రాలేదు.

ఇక కేసీఆర్‌ చిత్ర పటంను తొలగిస్తారా అలాగే కొనసాగిస్తారా అనే విషయమై కూడా అధికారుల నుండి స్పందన రాలేదు.తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ రాచరికంగా వ్యవహరిస్తూ ఇలా హద్దులు మీరుతున్నాడు అంటూ బీజేపీ ఎమ్మెల్యే రాజా సింగ్‌ తీవ్ర స్థాయిలో విమర్శలు చేస్తున్నాడు.

యాదాద్రిలో కేసీఆర్‌ గుర్తులు పూర్తిగా పోయే వరకు బీజేపీ పోరాడుతుందని ఒక బీజేపీ నాయకుడు అన్నాడు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube