పీకే అనుకున్నది సాధిస్తారా ? కేసీఆర్ కు నమ్మకం కుదిరిందా ? 

Kcrs Decision To Take Political Decisions Entirely Under The Auspices Of Prashant Kishor

రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ గురించి ప్రత్యేకంగా చెప్పుకోనవసరంలేదు .ఆయన వ్యూహం అందించిన ప్రతి పార్టీ ఇప్పటివరకు విజయం సాధిస్తూనే ఉండడంతో ఆయనకు దేశ వ్యాప్తంగా క్రేజ్ పెరిగింది.

 Kcrs Decision To Take Political Decisions Entirely Under The Auspices Of Prashant Kishor-TeluguStop.com

ఆయనకు చెందిన ఐప్యాక్ సంస్థతో ఒప్పందం చేసుకునేందుకు అన్ని రాజకీయ పార్టీలు ప్రయత్నిస్తూనే ఉంటాయి.  ప్రశాంత్ కిషోర్ అండదండలు ఉంటే తాము అధికారంలో కూర్చున్నట్లే అనే అభిప్రాయం అన్ని పార్టీలలోనూ కలుగుతూ ఉండటంతోనే,  ప్రశాంత్ కిషోర్ కు ఈ స్థాయిలో జనాల్లో క్రేజ్ పెరిగింది.

ఇదిలా ఉంటే దేశవ్యాప్తంగా రాజకీయాలను మార్చేందుకు ప్రశాంత్ కిషోర్ బీజేపీ కాంగ్రెస్ పార్టీలకు ప్రత్యామ్నాయంగా మూడో ఫ్రంట్ ను తెరపైకి  తెస్తున్నారు.బిజెపి కాంగ్రెస్ పార్టీ మళ్లీ అధికారంలోకి రాలేదని, తన వ్యూహం ప్రకారం ప్రాంతీయ పార్టీల కూటమి మళ్ళీ అధికారంలోకి వస్తుందని ప్రశాంత్ కిషోర్ నమ్మకంతో ఉన్నారు.

 Kcrs Decision To Take Political Decisions Entirely Under The Auspices Of Prashant Kishor-పీకే అనుకున్నది సాధిస్తారా కేసీఆర్ కు నమ్మకం కుదిరిందా  -Political-Telugu Tollywood Photo Image-TeluguStop.com

     దీనికోసమే పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ కి రాజకీయ వ్యూహాలు అందించడంతో పాటు,  జాతీయ స్థాయిలో ఆమెను ఫోకస్ చేసి ఆమెను ప్రధానిని చేయాలనే లక్ష్యంతో ప్రశాంత్ కిషోర్ ఉన్నారు.  దీనికోసమే ప్రాంతీయ పార్టీలన్నిటినీ ఏకం చేసే పనిలో  ప్రశాంత్ కిషోర్ ఉన్నారు.

ఈ నేపథ్యంలోనే మమతా బెనర్జీకి మద్దతుగా కేసీఆర్ ను పికే సిద్ధం చేస్తున్నారు అనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.కేసీఆర్ తో పాటు జగన్, స్టాలిన్,  కేజ్రీవాల్ ఇలా అందరినీ ఏకం చేసే పనిలో ప్రశాంత్ కిషోర్ ఉన్నారు.

దీనికోసమే తెలంగాణలో మళ్లీ టిఆర్ఎస్ను గెలిపించేందుకు అవసరమైన అన్ని వ్యవహారాలను ప్రశాంత్ కిషోర్ ఆధ్వర్యంలోనీ  ఐ ప్యాక్ టీమ్ రెడీ చేస్తున్నట్లు సమాచారం.దీనిలో భాగంగానే ప్రశాంత్ కిషోర్ టీం ఇప్పటికే ప్రగతి భవన్ కేసీఆర్ తో భేటీ కావడం,  రాష్ట్ర వ్యాప్తంగా సర్వేను నిర్వహించేందుకు ఏర్పాట్లు చేసుకోవడం ఇవన్నీ దీనిలో భాగంగానే జరుగుతున్నాయట.

       ఇక ప్రశాంత్ కిషోర్ అండదండలు ఉంటే మళ్లీ తెలంగాణలో టిఆర్ఎస్ ప్రభుత్వం ఏర్పడేందుకు   ఎటువంటి ఇబ్బందులు ఉండవు అనే లెక్కల్లో కెసిఆర్ ఉండటంతోనే ఆయన సూచించినట్లుగా బిజెపి ప్రభుత్వం పై గతంలో ఎప్పుడూ లేని విధంగా కెసిఆర్ విరుచుకుపడుతూ పెద్ద ఎత్తున విమర్శలు చేస్తున్నారు.జాతీయ స్థాయిలో ప్రాంతీయ పార్టీలను ఏకం చేసి తన సత్తా చాటాలని పికే చూస్తుండగా , మళ్లీ తెలంగాణలో అదికారంలోకి రావడమే లక్ష్యంగా కేసీఆర్ పీకే అడుగు జాడల్లో నడిచేందుకు సిద్ధం అవుతున్నారు. 

#TRS #Fedaral #Mamatha Benarji #Central

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube