టీఆర్ఎస్ లో చీలిక పీకే తో డీల్ ? కేసీఆర్ అన్న కూతురు సంచలన వ్యాఖ్యలు ?

క్రమశిక్షణకు మారుపేరుగా పైకి కనిపిస్తున్న తెలంగాణ అధికార పార్టీ టిఆర్ఎస్ పరిస్థితి అన్ని పార్టీల మాదిరిగానే వర్గపోరు, ఆధిపత్య పోరుతో ముందుకు వెళ్తుందా అనే అనుమానాలు కలుగుతున్నాయి.తాజాగా ఓ మీడియా కు ఇంటర్వ్యూ ఇచ్చిన కేసీఆర్ అన్న కుమార్తె రమ్యరావు అనేక సంచలన విషయాలు వెల్లడించారు.

 Kcrs Daughterramyaraos Sensational Comments About Trs Kcr, Ktr, Santhosh, Ramyar-TeluguStop.com

ఈ సందర్భంగా టిఆర్ఎస్ లో అంతర్గతంగా చోటుచేసుకుంటున్న పరిణామాలను ఆమె వివరించారు.కెసిఆర్ తరువాత ఆ స్థానం కేటీఆర్ దే.అందులో సందేహం లేదు.అయితే ఆ స్థానానికి కేసిఆర్ బంధువు, ఆయనకు అత్యంత సన్నిహితుడిగా పేరుపొందిన సంతోష్ కూడా పోటీ పడుతున్నారు అనే విషయాన్ని రమ్యా రావు వెల్లడించారు.

దీనికోసం సంతోష్ భారీ ప్రణాళికతో ముందుకు వెళుతున్నారని వివరించారు.

ఇటీవల కేటీఆర్ సంతోష్ ఇద్దరూ పోటీ పడుతూ మహిళల తో స్వాగతం పలికించుకున్న విధానాన్ని ఆమె ప్రస్తావించారు.

నారాయణపేటలో మహిళలతో కేటీఆర్ స్వాగతం చెప్పించుకోవడం చూసిన సంతోష్ మహబూబ్ నగర్ జిల్లాలో ఆ విధంగానే స్వాగతం చెప్పించుకున్నారని రమ్యరావు వెల్లడించారు.కేటీఆర్ 1000 మందితో అభివాదం చేయించుకుంటే సంతోష్ 2000 మందితో జై జైలు కొట్టించుకున్నాడు అంటూ ఆమె చెప్పుకొచ్చారు.

కేటీఆర్ కు ధీటుగా ఎదిగేందుకు, తనకంటూ సొంత వర్గాన్ని ఏర్పాటు చేసుకునేందుకు సంతోష్ ఎప్పటి నుంచో ప్రయత్నిస్తున్నారంటూ ఆమె చెప్పుకొచ్చారు.

Telugu Ramyarao, Santhosh, Telangana, Trs Mp Santhosh-Telugu Political News

అంతేకాదు రాబోయే రోజుల్లో సంతోష్ ముఖ్యమంత్రి అయ్యేందుకు ప్రయత్నిస్తున్నారని, దీనికోసం రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ తో 250 కోట్లు దిల్ ను కుదుర్చుకున్నారు అంటూ సంచలన విషయాలు వెల్లడించారు.అంతేకాదు త్వరలోనే టిఆర్ఎస్ పార్టీ రెండుగా చీలి పోతుంది అంటూ ఆమె సంచలన విషయాలు బయటపెట్టారు.మొదటి నుంచి కేసీఆర్ సంతోష్ కు ప్రాధాన్యం ఇస్తూ వస్తున్నారు.

మొదటి నుంచి కేసీఆర్ కు సన్నిహితంగా ఉంటూ, ఆయనకు సంబంధించిన అన్ని వ్యవహారాలను సంతోష్ చక్కబెడుతూ వచ్చేవారు.

Telugu Ramyarao, Santhosh, Telangana, Trs Mp Santhosh-Telugu Political News

ఏ విషయాన్ని అయినా సంతోష్ తోనే కెసిఆర్ పంచుకుంటారు.ఈ విషయం కేటీఆర్ తో పాటు టిఆర్ఎస్ నాయకులు అందరికీ తెలుసు.అయితే ఇప్పుడు అదే సంతోష్ పై కెసిఆర్ అన్న కుమార్తె రమ్య రావు ఈ విధమైన సంచలన వ్యాఖ్యలు చేయడంతో పాటు, కేటీఆర్ సంతోష్ మధ్య ఆధిపత్య పోరు నడుస్తోంది అన్నట్లుగా మీడియా ద్వారా వెల్లడించడం ఇవన్నీ టీఆర్ఎస్ ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube