కేసీఆర్ కేబినెట్‌లో మంత్రిగా క‌విత‌..!

రాజ‌కీయాల్లో అధికార‌మే ప‌ర‌మావ‌ధి….ఎలాంటి వారు అయినా అధికారం కోసం వేయ‌ని ఎత్తులు ఉండ‌వు.

 Kcr’s Daughter K. Kavitha Eye On Telangana Cabinet-TeluguStop.com

ప‌న్న‌ని వ్యూహాలు ఉండ‌వు.అధికారం కోసం సొంత బంధువులు, ర‌క్త సంబంధీకులు కూడా ఒక‌రిపై మ‌రొక‌రు ఎత్తులు వేసుకుంటూ ఉంటారు.

ఇప్పుడు తెలంగాణ సీఎం కేసీఆర్ కుమార్తె క‌విత సైతం ఓ భారీ వ్యూహంలో ఉన్న‌ట్టు టీ పాలిటిక్స్‌లో ఇంట‌ర్న‌ల్‌గా వార్త‌లు వినిపిస్తున్నాయి.

తెలంగాణ జాగృతి అధ్య‌క్షురాలిగా తెలంగాణ ఏర్పాటులో త‌న వంతు క్రియాశీల‌క పాత్ర పోషించిన క‌విత గ‌త ఎన్నిక‌ల్లో నిజామాబాద్ లోక్‌స‌భ నియోజ‌క‌వ‌ర్గం నుంచి పోటీ చేసి ఎంపీగా గెలిచారు.

ఆమె ఎంపీ కాక‌ముందు తెలంగాణ వ్యాప్తంగా అన్ని జిల్లాల్లోను కీ రోల్ ప్లే చేశారు.ఎంపీ అయ్యాక కేవలం నిజామాబాద్ జిల్లాకే ప‌రిమిత‌మైపోయాన‌న్న భావ‌న ఆమెలో ఉండిపోయింది.

ఇక క‌విత సోద‌రుడు కేటీఆర్‌, బావ హ‌రీష్‌రావులు కేసీఆర్ కేబినెట్లో మంత్రులుగా ఉన్నారు.క‌విత సైతం కేంద్ర మంత్రి అవుతుంద‌న్న టాక్ కొద్ది రోజులుగా వినిపించింది.

టీఆర్ఎస్ ఎన్డీయే స‌ర్కార్‌లో చేరితో కవిత‌తో పాటు మ‌రో సీనియ‌ర్ ఎంపీకి మంత్రి ప‌ద‌వి ఇవ్వాల‌ని కేసీఆర్ మోడీ వ‌ద్ద ప్ర‌తిపాద‌న కూడా పెట్టార‌న్న ప్ర‌చారం జ‌రిగింది.అయితే కేసీఆర్ ముందుగా తెలంగాణ అభివృద్ధి, స్టేట్ కేబినెట్ ప్ర‌క్షాళ‌న మీద కాన్‌సంట్రేష‌న్ చేయ‌డంతో టీఆర్ఎస్ ఎన్డీయే స‌ర్కార్‌లో చేరే అంశం కాస్త మ‌రుగున ప‌డింది.

క‌విత‌కు కూడా మంత్రి ప‌ద‌విపై బ‌లంగా ఆశ ఉన్నా కేంద్రంలో మంత్రి ప‌ద‌వి ఇప్పుడే వ‌చ్చే సూచ‌న‌లు లేవు.వ‌చ్చే ఎన్నిక‌ల త‌ర్వాత అది కూడా టీఆర్ఎస్ – బీజేపీ మ‌ధ్య అల‌యెన్స్ ఉండాలి…అప్పుడు కూడా కేంద్రంలో బీజేపీ రావాలి.

అప్పుడే క‌విత మంత్రి ప‌ద‌వి కోరిక తీరుతుంది.అయితే ఇవ‌న్నీ జ‌రుగుతాయో లేదో అన్న మీమాంస‌తో ఉన్న క‌విత త‌న వెర్ష‌న్ మార్చుకున్నార‌న్న టాక్ టీ పాలిటిక్స్‌లో.

ఇంకా చెప్పాలంటే టీఆర్ఎస్ వ‌ర్గాల్లో అంత‌ర్గ‌తంగా వినిపిస్తోంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube