కేసీఆర్ కు మేనల్లుడి భయం పట్టుకుందా ?

టీఆర్ఎస్ పార్టీలో కేసీఆర్ తరువాత ఆ స్థాయిలో ఇమేజ్ సంపాదించుకుని తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు ఆయన మేనల్లుడు హరీష్ రావు.టీఆర్ఎస్ ఆవిర్భావం నుంచి హరీష్ పార్టీ కోసం అహర్నిశలు కృషి చేశారు.

 Kcrlooking Toafraid Of Harish Rao-TeluguStop.com

కేసీఆర్ ఏమి చెబితే అది తూచా తప్పకుండా చేస్తూ కేసీఆర్ కు అత్యంత సన్నిహితుడిగా మారాడు.ప్రత్యేక తెలంగాణ ఆవిర్భావం తరువాత ఏర్పడిన టీఆర్ఎస్ ప్రభుత్వంలో భారీ నీటిపారుదల శాఖ మంత్రిగా పనిచేసి మంచి గుర్తింపు తెచ్చుకున్నారు.

అయితే రెండోసారి ఏర్పడిన టీఆర్ఎస్ ప్రభుత్వంలో హరీష్ రావు కు మంత్రి పదవి దక్కకపోగా ఆయన్ను దూరం పెడుతూ వచ్చారు.ఒకదశలో ఆయన్ను టీఆర్ఎస్ నుంచి బయటకి పంపాలన్న ఆలోచనలో కేసీఆర్ ఉన్నట్టు కూడా ప్రచారం జరిగింది.

కానీ ఆ తరువాత మారిన పరిస్థితుల నేపథ్యంలో ఆయనకు తగిన ప్రాధాన్యం ఇస్తున్నట్టు అందరికి సంకేతాలు పంపారు.

-Telugu Political News

ఆయన్ను దగ్గర చేసుకున్నట్టు కనిపిస్తున్నా లోలోపల మాత్రం కాస్త దూరంగా పెట్టారనేది కాదనలేని నిజం.ఈ నేపథ్యంలో హరీష్ రావు బీజేపీ పార్టీలోకి వెళ్తున్నాడని గతకొన్ని నెలలుగా అప్పుడప్పుడు కథనాలు ప్రచారంలోకి వచ్చాయి.పైగా హరీష్ రావు ఒక్కడే వెళ్లకుండా సుమారు పదిహేను మంది ఎమ్మెల్యేలను కూడా తనతో తీసుకెళ్లేందుకు సిద్ధం అయ్యాడని, అందుకు తగ్గట్లుగా అన్ని ఏర్పాట్లు చేసుకున్నాడని అనేక రకాలుగా ప్రచారాలు జరిగాయి.

అయితే అవన్నీ వట్టి పుకార్లేనని ఎప్పటికప్పుడూ హరీష్ రావు వివరణ ఇస్తూనే ఉన్నారు.ఆ వివరణ ప్రకారం చూస్తే హరీష్ రావు పార్టీ మారుతున్నారనే ప్రచారం అబద్దమని తేలిపోయింది.

అయినా ప్రచారం మాత్రం ఆగడంలేదు.అయితే ఈ ప్రచారాలు వెనుక ఉన్నది హరీష్ రావు సన్నిహితులు ఉన్నట్టు ప్రచారం మొదలయ్యింది.

-Telugu Political News

టీఆర్ఎస్ లో హరీష్ ప్రాధాన్యత తగ్గటం జీర్ణయించుకోలేకే ఆయన విలువ అధినేతకు తెలియాలనే ఆయన పార్టీ మారుతున్నట్లు లీకులు ఇవ్వడం మొదలెట్టారట.అయితే ఈ విషయాలు అన్ని హరీష్ రావుకి తెలిసే జరుగుతున్నాయని, కేసీఆర్ పై ఎమోషనల్ గా ఒత్తిడి తెచ్చే ప్రయత్నంలోనే ఇదంతా ప్లాన్ ప్రకారం హరీష్ రావు ఆలోచనతోనే ఆయన అనుచరులు చేస్తున్నారని గుసగుసలు తెలంగాణలో మొదలయ్యాయి.అయితే ప్రస్తుతం మంత్రివర్గాన్ని విస్తరించే ఆలోచనలో ఉన్న కేసీఆర్ ఆ విస్తరణలో హరీష్ రావు కు మంత్రిపదవి కేటాయించబోతున్నట్టు ప్రచారం జరుగుతోంది.ఇదంతా పార్టీ శ్రేణుల్లో హరీష్ రావు కు ఉన్న ఇమేజ్ ను దృష్టిలో పెట్టుకుని ఇవ్వబోతున్నారు తప్ప మనస్ఫూర్తిగా హరీష్ ను చేరదీసే ఉద్దేశం కేసీఆర్ కు లేదని, దీనంతటికి కారణం భవిష్యత్తులో హరీష్ రావు వల్ల తన కుమారుడు కేటీఆర్ కు రాజకీయంగా ఇబ్బందులు ఉండకూడదు అనే కేసీఆర్ ఇలా చేస్తున్నాడట.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube