ఒకే దెబ్బ‌తో కేసీఆర్‌, బండికి చెక్ పెడుతున్న రేవంత్‌.. ప్లాన్ మామూలుగా లేదు

అస‌లు రేవంత్ రాక‌ముందు పోరాట ప‌ఠిమ‌నే మ‌ర్చిపోయే స్థితికి వ‌చ్చిన కాంగ్రెస్‌ను ఇప్పుడు ప‌రుగులు పెట్టిస్తున్నారు రేవంత్ రెడ్డి.అస‌లు పోరాటం అంటే ఎలా ఉంటుందో చూపిస్తూ రాష్ట్రాన్ని ఉక్కిరిబిక్కిరి చేస్తున్నారు.

 Kcr With A Single Blow, Revant Checking The Cart .. The Plan Is Not Normal, Reva-TeluguStop.com

ప్ర‌తిప‌క్ష పార్టీల‌కు అవ‌కాశం ఇవ్వ‌కుండా వ‌రుస పోరాటాల‌తో జ‌నం దృష్టిని ఆక‌ర్షించే ప్ర‌య‌త్నం చేస్తున్నారు.ఇక ఇందులో భాగంగా ఇప్ప‌టికే పెట్రోల్ ధ‌ర‌లు, రైతుల స‌మ‌స్య‌ల‌పై వ‌రుస నిర‌స‌న‌లు చేసిన అనంత‌రం ఇప్ప‌డు కాంగ్రెస్‌కు దూర‌మైన ద‌ళిత‌, గిరిజ‌న వ‌ర్గాల‌ను ఆక‌ట్టుకునేందుకు మ‌ళ్లీ దళిత‌, గిరిజ‌న దండోరా కార్య‌క్ర‌మాన్ని నిర్వ‌హిస్తున్న సంగ‌తి తెలిసిందే.

ఇక ఇదులో భాగంగా ఇటీవ‌ల ఇంద్రవెల్లిలో లక్షకు పైగా జనాల్ని తీసుకొచ్చి మ‌రీ ఈ సభకు విజ‌యవంతం చేశారు రేవంత్ రెడ్డి.కాగా ఈ స‌భ ఎఫెక్ట్ కూడా అన్ని పార్టీల‌పై బాగానే ప‌డిన‌ట్టు తెలుస్తోంది.

ఓ వైపు కేసీఆర్ దళితబంధుతో ఆ వ‌ర్గాన్ని ఆక‌ట్టుకునే ప్ర‌య‌త్నం చేస్తున్న కేసీఆర్ కు ధీటుగా ఆయ‌న‌కు చెక్ పెడుతూ ఇంకోవైపు దండోరా సభల‌ను సక్సెస్ చేసే ప‌నిలో ప‌డ్డారు రేవంత్‌.ఇక రెండో స‌భ‌పై చ‌ర్చ‌లు జ‌రుగున్న స‌మ‌యంలోనే మూడో సభను మెదక్ పార్ల‌మెంట్ పరిధిలో నిర్వహించాలని రేవంత్ ఆలోచిస్తున్న‌ట్టు తెలుస్తోంది.

Telugu Bandisanjay, Dalithagirijan, Revanth, Trs, Ts Congress, Ts Potics-Telugu

అయితే ఇక్క‌డే అస‌లు మ్యాట‌ర్ ఉంది.అదేంటంటే ఈ స‌భ‌ను కాస్తా కేసీఆర్ ఇలాకా అయిన గజ్వేల్ లో నిర్వ‌హించ‌డ‌మే.ఈ విధంగా కేసీఆర్ ఇమేజ్‌ను గ‌జ్వేల్ లో దెబ్బ‌తీసేందుకు పెద్ద ఎత్తున రేవంత్‌రెడ్డి ప్లాన్ చేస్తున్న‌ట్టు తెలుస్తోంది.అయితే ఇదే క్ర‌మంలో బండి సంజ‌య్‌కు కూడా చెక్ పెట్ట‌నున్నారు రేవంత్‌.

అదెలా అంటే ఈ నెల24న బండి సంజ‌య్ పాదయాత్రను షురూ చేస్తున్నారు.ఇక అదే రోజున రేవంత్ ఈ స‌భ నిర్వ‌హించి బండి సంజయ్ కంటే రేవంత్ ఇమేజ్ ఎక్కువగా ఉందన్న విషయాన్ని నిరూపించాలాని పార్టీ శ్రేణులు భావిస్తున్నారంట‌.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube