ఆ సభతో టీఆర్ఎస్ సత్తా ఏంటో చూపించనున్న కేసీఆర్ ?

మునుగోడు ఉప ఎన్నికల్లో విజయం సాధించడమే ఏకైక లక్ష్యంగా టిఆర్ఎస్ అధినేత తెలంగాణ సీఎం కేసీఆర్ రాజకీయ వ్యూహాలు రచిస్తున్నారు.ఈ ఎన్నికలు అత్యంత ప్రతిష్టాత్మక కావడంతో పాటు , మూడోసారి అధికారంలోకి వచ్చేందుకు ఈ ఎన్నికలు రెఫరెండం గా మారబోతుండడంతో కెసిఆర్ ఈ విషయంలో చాలా అప్రమత్తంగా వ్యవహరిస్తున్నారు.

 Kcr Will Show The Power Of Trs With That Meeting ,trs, Kcr, Telangana Cm, Telang-TeluguStop.com

టిఆర్ఎస్ ప్రభుత్వం పై ప్రజల్లో వ్యతిరేకత పెరుగుతుందని ప్రతిపక్షాలు విమర్శలు చేస్తూ, ప్రజల్లోకి తీసుకు వెళ్తున్న తరుణంలో ఈ ఎన్నికల్లో గెలవడం ద్వారా ప్రతిపక్షాల విమర్శల్లో వాస్తవం లేదనే విషయాన్ని చాటి చెప్పాలని , మూడోసారి ఎన్నికల్లో గెలిచి ఈ ఉప ఎన్నికలను రాబోయే సార్వత్రిక ఎన్నికలకు రెఫరెండం గా చూపించాలని కేసీఆర్ భావిస్తున్నారు.

మునుగోడు నియోజకవర్గంలో కేసీఆర్ ఆధ్వర్యంలో భారీ బహిరంగ సభను నిర్వహించబోతున్నారు.

ఈ సభ నిర్వహణకు భారీగా జన సమీకరణ చేపట్టి టిఆర్ఎస్ సత్తా చాటాలని ప్లాన్ చేస్తున్నారు.ఈ మేరకు నల్గొండ జిల్లా మంత్రి జగదీశ్వర్ రెడ్డి , ఎంపీ, ఎమ్మెల్యేలు,  ఎమ్మెల్సీలు,  జడ్పీ చైర్మన్ లకు నియోజకవర్గం బాధ్యతలను అప్పగించారు.

మంత్రి జగదీశ్వర్ రెడ్డి మునుగోడు మండలంలోని 12 గ్రామాల బాధ్యతలను తీసుకున్నారు .ఇక నల్గొండ ఎమ్మెల్యే కంచర్ల భూపాల్ రెడ్డి ఇదే మండలంలోని 15 గ్రామాల బాధ్యతలను తీసుకున్నారు.ఇక చౌటుప్పల్ పురపాలక బాధ్యతలను రాజ్యసభ సభ్యుడు బడుగుల లింగయ్య యాదవ్,  మిర్యాలగూడ ఎమ్మెల్యే భాస్కరరావు చౌటుప్పల్ మండలానికి , హుజూర్ నగర్ ఎమ్మెల్యే సైదిరెడ్డి, కోదాడ ఎమ్మెల్యే మల్లయ్య యాదవ్ , మర్రిగూడ మండలానికి చెందిన భువనగిరి ఎమ్మెల్యే శేఖర్ రెడ్డి, నాంపల్లి మండలానికి దేవరకొండ ఎమ్మెల్యే రవీందర్ నాయక్, ఎమ్మెల్సీ కోటిరెడ్డి, చుండూరు పురపాలక కు నకిరేకల్ ఎమ్మెల్యే లింగయ్య, చుండూరు మండలానికి నాగార్జునసాగర్ ఎమ్మెల్యే భగత్ , యాదాద్రి భువనగిరి జడ్పీ చైర్మన్ సందీప్ రెడ్డి, నారాయణపురం మండలానికి తుంగతుర్తి ఎమ్మెల్యే కిషోర్ , ఆలేరు ఎమ్మెల్యే సునీతలను ఇన్చార్జిలుగా నియమించారు.
 

Telugu Congress, Munugodu, Revanth Reddy, Telangana Cm, Telangana, Trs Munugodu-

త్వరలో జరగబోయే టిఆర్ఎస్ భారీ బహిరంగ సభను విజయవంతం కి కృషి చేయడంతో పాటు భారీ ఎత్తున జన సమీకరణ చేపట్టే బాధ్యతను అప్పగించారు.20న జరగబోయే టిఆర్ఎస్ సభను భారీగా నిర్వహించడం ద్వారా కాంగ్రెస్ బిజెపిలకు సవాలు విసరాలని ,జనాలలోను టిఆర్ఎస్ పై ఆదరణ పెరిగేలా చేసుకోవాలని వ్యూహంతో కెసిఆర్ ఉన్నారట.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube