కేసీఆర్ ఎప్పుడూ ఇంతే ! తేడా వస్తే అంతే ? 

అనుగ్రహం అయినా ఆగ్రహం అయినా, ఏదైనా కేసీఆర్ దాచుకోరు వెంటనే దాన్ని చూపిస్తారు.ఈ విషయం చాలా సందర్భాల్లో స్పష్టం అయింది.

 Kcr Will Never Forgive Those Who Oppose Their Decisions-TeluguStop.com

మొదటి నుంచి ఆయన స్వభావం ఇదే.టిఆర్ఎస్ పార్టీలో ఒక వెలుగు వెలిగిన చాలామంది నాయకులు ఇప్పుడు ఆ పార్టీలో కనిపించరు.ఎవరు ప్రాధాన్యం ఎంత కాలం ఉంటుందో చెప్పలేని పరిస్థితి.కీలకమైన నాయకులు అనుకున్న వారంతా ఎప్పుడో టిఆర్ఎస్ ను వీడి బయటకు వెళ్ళిపోయారు.దీనంతటికీ కారణం వారు కెసిఆర్ దగ్గర నమ్మకం కోల్పోవడమే.కేసీఆర్ ఎప్పుడూ వీర విధేయులను మాత్రమే చేరదీస్తూ ఉంటారు.

తమ పార్టీలోనే ఉంటూ, తమతో సన్నిహితంగా మెలుగుతూ, తమ గురించి ఇతరుల దగ్గర విమర్శలు చేసే వారిని కానీ, పార్టీలో ధిక్కారసర్వస్వంతో వ్యవహరించే వారి విషయంలో కేసీఆర్ ట్రీట్మెంట్ ఇదే విధంగా ఉంటుంది.

 Kcr Will Never Forgive Those Who Oppose Their Decisions-కేసీఆర్ ఎప్పుడూ ఇంతే తేడా వస్తే అంతే  -Political-Telugu Tollywood Photo Image-TeluguStop.com

టిఆర్ఎస్ పార్టీ లో అగ్ర నాయకుడిగా పార్టీ ఆవిర్భావం నుంచి కేసీఆర్ తో పని చేస్తూ వచ్చిన ఈటెల రాజేందర్ వ్యవహారం చూసుకుంటే ఈ విషయం స్పష్టంగా అర్థం అవుతుంది.

ఆయనకు పార్టీలో కీలకమైన స్థానం ఇవ్వడమే కాకుండా, మంత్రివర్గంలోనూ అత్యధికంగా ప్రాధాన్యం ఇచ్చారు.కానీ రెండోసారి పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఈటెల రాజేందర్ వ్యవహార శైలిలో మార్పు కనిపించడం, తమపైనే ధికార స్వరం వినిపిస్తూ, తమ నిర్ణయాలపై సెటైర్లు వినిపిస్తూ, లెక్క చేయనట్లు గా వ్యవహరించడం, వివిధ కామెంట్స్ ఇలా అన్నింటినీ పరిగణనలోకి తీసుకున్న కేసీఆర్ అకస్మాత్తుగా ఆయనకు సంబంధించిన వ్యవహారాలపై విచారణ చేయించడం, మంత్రివర్గం నుంచి బర్తరఫ్ చేయడం వంటివి వెంటవెంటనే జరిగిపోయాయి.

Telugu Itela Rajendar, Kcr, Kodandaram, Ktr, Swamygoud, Telangana, Trs Government, Trs Party, Vijayasanthi-Telugu Political News

ఈటెల వ్యవహారమే కాదు, గతంలో జేఏసీ చైర్మన్ గా పనిచేసిన కోదండరాం విషయంలోనూ కేసీఆర్ వ్యవహారం ఇలాగే ఉంది.ప్రత్యేక తెలంగాణ సాధించే క్రమంలో కోదండరాం కు ఎక్కడ లేని ప్రాధాన్యం ఇచ్చేవారు.పదే పదే పొగుడుతూ ఆయన ద్వారా తెలంగాణ ఉద్యమాన్ని మరింత ముందుకు తీసుకు వెళ్లి చివరకు అనుకున్న లక్ష్యాన్ని చేరుకున్నారు.కానీ కోదండరాం వ్యవహారంలోనూ తేడా గమనించిన కేసీఆర్ వెంటనే ఆయనను పక్కకు పెట్టేశారు.

అలాగే విజయశాంతి విషయంలోనూ ఇంతే.ఆమెకు మొదట్లో ఎక్కడలేని ప్రాధాన్యం ఇవ్వడంతో పాటు, ఆమెను ఎంపీ గెలిపించి తన తర్వాత ఆమె అన్నట్లుగా వ్యవహరించేవారు.

కానీ చివరకు ఆమెను సైతం ఆకస్మాత్తుగానే పక్కన పెట్టేశారు.ఇక ఉద్యోగ సంఘాల నేత గా మంచి గుర్తింపు తెచ్చుకున్న స్వామిగౌడ్ విషయంలోనూ ఇదే రకమైన ట్రీట్మెంట్ లభించింది.

వీరే కాదు మరెంతో మంది పరిస్థితి ఇదే విధంగా ఉంది.అసలు దీనంతటికీ కారణం వారు కేసీఆర్ దగ్గర నమ్మకం కోల్పోవడమే.పార్టీలో అయినా, ప్రభుత్వంలో అయినా ఎక్కడైనా తన మాటే సుప్రీంగా ఉండాలి అనుకుంటారు తప్ప, తమపైనే అసంతృప్తితో, ఆగ్రహంతో ఉండేవారిని కెసిఆర్ ఏమాత్రం ఉపేక్షించరు అనే విషయం ఈటెల వ్యవహారంలో మరోసారి స్పష్టమైంది .

#TRS Government #Trs Party #Swamygoud #Itela Rajendar #Vijayasanthi

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు