దత్త పుత్రిక పెళ్లి వేడుకలో కే‌సి‌ఆర్ సతీమణి, బంగారు హారం కానుక

తెలంగాణ సి‌ఎం కే‌సి‌ఆర్ దత్త పుత్రిక ప్రత్యూష పెళ్లి నేడు ఉదయం 10 గంటలకు చరణ్ రెడ్డి తో క్రిస్టియన్ సంప్రదాయం ప్రకారం జరగనున్నది.ఈ వివాహ వేడుకను స్త్రీ శిశు సంక్షేమ శాఖ దగ్గరగా ఉండి పరిశీలిస్తుంది.

 Kcr Wife Shobha Gifted To Necklece To Prathyusha,charan Reddy,christmas,shobha,k-TeluguStop.com

నిన్న రాత్రి బేగంపేట్ ఐ‌ఏ‌ఎస్ అతిది గృహం నందు ప్రత్యూషను పెళ్లి కూతురుగా ముస్తాబు చేశారు.ఈ కార్యక్రమంలో కే‌సి‌ఆర్ భార్య శోభ పాల్గొన్నారు.

ప్రత్యూషకు పట్టుబట్టలు, డైమెండ్ నెక్లెస్ పెట్టి ఆశీర్వదించారు.గిరిజన, మహిళాభివృద్ది , శిశు సంక్షేమ శాఖ సత్యవతి రాథోడ్, మహిళాభివృద్ధి కమీషనర్, ప్రత్యేక కార్యదర్శి దివ్య పాల్గొన్నారు.

పాటిగడ్డ లూర్దుమాత ఆలయంలో క్రిస్టియన్ సంప్రదాయం ప్రకారం పెళ్లి జరుగుతుంది.రామ్ నగర్ కు చెందిన జైన్ మేరీ, మర్రిరెడ్డి దంపతుల కుమారుడు చరణ్ రెడ్డి గత అక్టోబర్‌ లో ప్రత్యూష తో నిశ్చితార్థం జరిగింది.

కన్నతండ్రి, చవతి తల్లి చిత్ర హింసలకు గురైన ప్రత్యూష దయనీయమైన పరిస్థితిలో ఉంటే కే‌సి‌ఆర్ ఆమె పడుతున్న బాదను చూసి చలించి ఆమెను దత్తత తీసుకున్నాడు.కే‌సి‌ఆర్ మహిళ శిశు సంక్షేమ శాఖ అధికారులకు ప్రత్యూష బాగోగులను చూసుకోవాలని చెప్పడంతో అప్పటినుండి వారి సంరక్షణలోనే ఉంటూ నర్సింగ్ విద్యను పూర్తి చేసి ఇప్పుడు ఓ ప్రైవేట్ హాస్పిటల్ లో జాబ్ చేస్తుంది.

.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube