కేసీఆర్ మారుతున్నారు.. మీరు మారరా ?

టిఆర్ఎస్ అధినేత కేసిఆర్ లో స్పష్టమైన మార్పు కనిపిస్తోంది.గతంతో పోలిస్తే ఇప్పుడు ఆయన యాక్టివ్ అయ్యారు.

 Telangana Cm Kcr Who Wants To Change Himself And Party Leaders, Telangana Cm, Kc-TeluguStop.com

రాజకీయంగా యాక్టివ్ గా నిర్ణయాలు తీసుకుంటూ, జనాలో తిరగకపోతే పార్టీ ప్రతిపక్షంలో కూర్చోవాల్సి వస్తుంది అని భయం కెసిఆర్ కలిగింది.ఇటీవలే మంత్రివర్గం నుంచి ఈటెల రాజేందర్ ను భర్తరఫ్ చేసి ఆయన నిర్వహిస్తున్న వైద్య ఆరోగ్య శాఖ ను తానే ఇప్పుడు నిర్వహిస్తున్నారు.

ప్రస్తుతం కరోనా వైరస్ ప్రభావం ఎక్కువగా ఉండడంతో క్షేత్రస్థాయి పర్యటనలు చేపడుతున్నారు.ఇప్పటి వరకు ప్రభుత్వ వ్యతిరేకత బాగా పెరిగిందనే నిఘా నివేదికలను సైతం కెసిఆర్ పరిగణలోకి తీసుకున్నట్లు కనిపిస్తున్నారు.

అందుకే నిరుద్యోగ సమస్య విషయంలో టిఆర్ఎస్ ప్రభుత్వం ఎక్కువగా విమర్శలు ఎదుర్కొంటూ ఉండడంతో టి పి సి ఎస్ సి కొత్త బోర్డును ఏర్పాటు చేశారు.
  ఇక నిరవధికంగా ఉద్యోగ నోటిఫికేషన్లు ఉంటాయని ప్రకటించారు.

కరోనా కట్టడికి ఇదే విధంగా చర్యలు మొదలుపెట్టారు.అలాగే ప్రభుత్వ పరంగా ఎటువంటి ఇబ్బందులు ప్రజలకు ఏర్పడకుండా అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నారు.

అలాగే మంత్రులు, ఎమ్మెల్యేలు సైతం నిరంతరం అప్రమత్తంగా ఉంటూ చెబుతున్నారు.ప్రజా సమస్యలను గుర్తిస్తూ పరిష్కారం దిశగా అడుగులు వేయాలని, ఎక్కడా ప్రభుత్వంపై ప్రజల్లో వ్యతిరేకత పెరగకుండా జాగ్రత్తగా చూసుకోవాల్సిన బాధ్యత మీదే అని చెబుతున్నారు.ఒకవైపు ఈటెల రాజేందర్,  మరోవైపు బిజెపి ,కాంగ్రెస్ వంటి రాజకీయ ప్రత్యర్థులను ఎదుర్కొనేందుకు అన్ని రకాల చర్యలను తీసుకుంటున్నారు.2023 లో టిఆర్ఎస్ ప్రభుత్వం ఏర్పడే విధంగా అన్ని జాగ్రత్తలు తీసుకుంటూనే కేసీఆర్ ముందుకు వెళ్తున్నారు.

Telugu Carona, Congress, Covid, Etela Rajender, Hareesh Rao, Job, Kcr Active, Te

అయితే పార్టీ శ్రేణులో మాత్రం కేసీఆర్ లో ఇప్పుడు కనిపిస్తున్న అంత ఉత్సాహం అయితే కనిపించడం లేదు.
  ఎమ్మెల్యేలు , కొంతమంది మంత్రులు వ్యవహారశైలిపై టిఆర్ఎస్ అధిష్టానానికి తీవ్ర అసంతృప్తి ఉంది.పనితీరు సక్రమంగా లేని వారిని పద్ధతి మార్చుకోవాలి అంటూ కొంతమంది పార్టీ సీనియర్ల ద్వారా కేసీఆర్ చెప్పించే ప్రయత్నం చేస్తున్నారు.తాను ఇప్పటివరకు విమర్శలు ఎదుర్కొన్నా, ఇప్పుడు పూర్తిగా మారిపోయాను అని, అదేవిధంగా పార్టీలోని నాయకులు అంతా తమ పనితీరు మార్చుకుని ప్రజలలో బలం పెంచుకోవాలని పరోక్షంగా హెచ్చరికలు జారీ చేస్తున్నారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube