మోత్కులపల్లి నరసింహులు( Mothkulapally Narasimhulu ).కాంగ్రెస్ లో మంత్రిగా పనిచేసిన ఈయన 2021 హుజురాబాద్ ఉప ఎన్నిక సమయంలో కేసీఆర్ సమక్షంలో బిఆర్ఎస్ పార్టీలోకి చేరారు.
అయితే తాజాగా వినిపిస్తున్న సమాచారం ప్రకారం బిఆర్ఎస్ ( BRS ) పార్టీ కేవలం మోత్కులపల్లి నరసింహులుని వాడుకుని వదిలేసారు అంటూ ప్రచారం జరుగుతుంది.ఎందుకంటే గత కొన్ని రోజులుగా మోత్కులపల్లి నరసింహులు మళ్లీ సొంత గూడు అయిన కాంగ్రెస్ లోకి వెళ్లాలని చూస్తున్నట్టు తెలుస్తుంది.
హుజురాబాద్ లో ఉప ఎన్నిక జరిగిన సమయంలో ఈటెల రాజేందర్ మీద ఎలాగైనా గెలవాలి అనే కసితో ఉన్న కేసీఆర్ మోత్కులపల్లి నరసింహులుని తన వైపు తిప్పుకొని దళిత బంధు స్కీం పెట్టి ఎస్సి ఓట్లు అన్ని తన వైపు మళ్ళించుకోవాలని చూశారు.

కానీ హుజురాబాద్ ఉప ఎన్నికల్లో ఈటెల రాజేందర్ ( Etela Rajender ) పై బిఆర్ఎస్ పార్టీ గెలవలేకపోయింది.ఇక హుజురాబాద్ ఉప ఎన్నిక సమయంలో దళిత బంధు ప్రకటించడం వల్ల దళిత నాయకుల్లో ప్రముఖుడైన మోత్కుపల్లి నరసింహులు ని కాంగ్రెస్ నుండి బిఆర్ఎస్లోకి ఆహ్వానించి ఎస్సీ ఓట్లు రాబట్టాలని చూసినప్పటికీ అది జరగలేదు చివరికి హుజురాబాద్ లో బిఆర్ఎస్ ఓటమిపాలైంది.అలాగే మోత్కుపల్లి నరసింహులు కి ఈసారి తుంగతుర్తి అసెంబ్లీ టికెట్ ఇస్తారని ఆశపడ్డారు.
కానీ కెసిఆర్( KCR ) ప్రకటించిన జాబితాలో మోత్కులపల్లి పేరు లేకపోవడంతో ఆయన నిరాశ పడ్డారు.అలాగే ఎమ్మెల్యే సీటు కాకపోయినా కూడా ఎమ్మెల్సీ లేదా ఎంపీ సీటు ఇస్తారని ఆశపడ్డప్పటికీ అది కూడా జరిగేటట్లు కనిపించడం లేదు.

దీంతో బిఆర్ఎస్ పార్టీపై ఆశ వదులుకున్న మోత్కుపల్లి కర్ణాటక వెళ్లి డీకే శివకుమార్ ( DK Shiva kumar ) ని కలిసినట్టు తెలుస్తోంది.మరి మోత్కులపల్లి మళ్లీ కాంగ్రెస్ లోకి వచ్చి రేవంత్ రెడ్డి తో పోసగగలుగుతారా లేదా అనేది కాంగ్రెస్ నాయకులు చర్చించుకుంటున్నారు.ఏది ఏమైనప్పటికీ బిఆర్ఎస్ పార్టీ కేవలం మోత్కులపల్లి నరసింహులు ని పావుగా వాడుకొని వదిలేసింది అని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.