కేటీఆర్‌కే చెక్ పెట్టిన కేసీఆర్‌... భ‌లే ట్విస్ట్ ఇచ్చారే ?

తెలంగాణ ముఖ్య‌మంత్రి కేసీఆర్ ఎప్పుడు ఏ నిర్ణ‌యం తీసుకుంటారో ? ఎవ‌రికి తెలియ‌దు.తాజాగా ఆయ‌న త‌న కుమారుడు కేటీఆర్‌కే అదిరిపోయే షాక్ ఇచ్చార‌న్న వార్త‌లు తెలంగాణ రాజ‌కీయ వ‌ర్గాల్లో.

 Kcr Who Checked Ktr Who Gives A Good Twist?, Telangana, Political News, Politica-TeluguStop.com

ఇంకా చెప్పాలంటే అధికార టీఆర్ఎస్ పార్టీలోనే వినిపిస్తున్నాయి.కేటీఆర్ వ‌ర్గం డామినేష‌న్ తెలంగాణ రాజ‌కీయాల్లో పెరిగిపోతోంద‌న్న చ‌ర్చ‌లు కొద్ది రోజులుగా వినిపిస్తున్నాయి.

చివ‌ర‌కు హ‌రీష్‌ను సైడ్ చేసేస్తున్నార‌న్న ప్ర‌చారం కూడా ఎక్కువ కావ‌డంతో కేసీఆర్ వెంట‌నే అలెర్ట్ అయ్యారు.కేటీఆర్ వ‌ర్గానికి చెక్ పెట్టేశార‌నే అంటున్నారు.

చివ‌ర‌కు మంత్రులు సైతం అత్యుత్సాహంతో కేటీఆర్ ముఖ్య‌మంత్రి కావాల‌ని కోరుకుంటున్నారు.కేసీఆర్ వీళ్ల ఆశ‌ల‌పై నీళ్లు చ‌ల్లేశారు.త్వరలో సాగర్ ఉప ఎన్నికతో పాటు ఎమ్మెల్సీ ఎన్నికలు ఉండటంతో కేసీఆర్ .కేటీఆర్ గ్రూప్‌న‌కు చెక్ పెట్టేశార‌నే టాక్ బ‌య‌ట‌కు వ‌చ్చేసింది.ఇటీవ‌ల కీల‌క అంశాల విష‌యంలో కేసీఆర్‌.కేటీఆర్ ప్ర‌తిపాద‌న‌ల‌ను ప‌క్క‌న పెట్టేస్తున్నారు.ఇటీవల జరిగిన హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ మేయర్, డిప్యూటీ మేయర్ ఎన్నికల్లో కేటీఆర్ వర్గాన్ని కేసీఆర్ పూర్తిగా పక్కన పెట్టారంటున్నారు.

Telugu Deputy Mayor, War, Shobhan Reddy, Telangana, Trs, Trs Ministers-Telugu Po

మునిసిప‌ల్ ఎన్నిక‌ల బాధ్య‌త అంతా కేటీఆర్ త‌న భుజాల మీదే వేసుకుని చూసుకున్నారు.ప్ర‌చారం కూడా ఆయ‌నే చేప‌ట్టారు.అయితే మేయ‌ర్‌, డిప్యూటీ యేయ‌ర్ల విష‌యంలో ఆయ‌న సూచించిన పేర్ల‌ను ప‌క్క‌న పెట్టిన కేసీఆర్‌.

ఎంపీ కెకె కుమార్తె విజ‌య‌ల‌క్ష్మితో పాటు … తెలంగాణ మూమెంట్ నుంచి త‌న‌తో క‌లిసి ఉన్న శోభ‌న్ రెడ్డి స‌తీమణికి మేయ‌ర్‌, డిప్యూటీ మేయ‌ర్ ప‌ద‌వులు ఇవ్వడం పార్టీలో చర్చనీయాంశమైంది.కేటీఆర్ సీఎం అంటూ జ‌రుగుతోన్న ప్ర‌చారంతో లాభం కంటే న‌ష్ట‌మే ఎక్కువ ఉంద‌న్న అంచ‌నాతోనే కేసీఆర్ వ్యూహాత్మ‌కంగా కేటీఆర్ వ‌ర్గానికి తాత్కాలికంగా చెక్ పెడుతున్న‌ట్టు భోగ‌ట్టా ?

.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube