వాళ్ల బలహీనతనే బలంగా మార్చుకుంటున్న కేసీఆర్ !  

టీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ లో ఎప్పుడూ… కాన్ఫిడెన్స్ కనిపిస్తూనే ఉంటుంది. తన మాటలతో… కొండల్ని కూడా పిండి చేయగలమన్న ధీమాను పార్టీ నాయకులకు , ప్రజలకు కలిగిస్తూ ఉంటాడు. అదే ధీమాతో తెలంగాణాలో ముందస్తు ఎన్నికలకు సైతం వెళ్ళిపోయాడు. అయితే ఆ తరువాత ఆయన ఊహించినట్టుగా ఏమీ జరగలేదు. ఎవరూ ఊహించని విధంగా తెలంగాణాలో ఉన్న టీఆర్ఎస్ వ్యతిరేక పార్టీలన్నీ కలిసి మహాకూటమిగా ఏర్పడ్డాయి. టీఆర్ఎస్ అంతమే మా పంతం అన్నట్టుగా మహాకూటమి స్పీడ్ పెంచినది. దీంతో టీఆర్ఎస్ పార్టీ డైలమాలో పడిపోయింది. అనవసరంగా ముందస్తుకు వెళ్లి తప్పుచేశామా అన్నట్టుగా పశ్చాత్తాపం కేసీఆర్ లో కనిపించింది.

KCR Wants To Use Opposite Parties Negative Points Win In 2018-Ktr Mahakutami Negative Of Party Trs

KCR Wants To Use Opposite Parties Negative Points To Win In 2018

అయితే కూటమిలో ఏర్పడిన లుకలుకలు అందులోని పార్టీల ఐక్యత దెబ్బతీయడంతో… ఇప్పుడు కేసీఆర్ మళ్లీ అదే మాట చెబుతున్నాడు. వంద అసెంబ్లీ సీట్లకు తగ్గేది లేదని చెబుతున్నాడు. కేసీఆర్ గ్రాఫ్ తగ్గిందని కొంతమంది విశ్లేషకులు అంటున్నప్పటికీ ఆయన మాత్రం అదే కాన్ఫిడెన్స్ తో కనిపిస్తూ ఉండటం విశేషం. ఇప్పటికే టీఆర్ఎస్ అభ్యర్థులు ప్రచార పర్వంలో దూసుకుపోతున్నారు. అయితే మహాకూటమి మాత్రం ఇంకా సీట్లు సర్దుకోవడంలోనే బిజీగా ఉంది. ప్రస్తుతానికి సీట్ల సర్దుబాటుపై ఒక అవగాహనకు అందులోని పార్టీలు వచ్చినా… మహాకూటమిలో ఎవరు ఏ స్థానాల్లో పోటీ చేస్తారో తెలిసినా.. ఆయా స్థానాల్లో అన్ని పార్టీల వాళ్లూ ఐక్యంగా పని చేస్తారా? అనేది మాత్రం పెద్ద సందేహమే.

KCR Wants To Use Opposite Parties Negative Points Win In 2018-Ktr Mahakutami Negative Of Party Trs

నేతలు దగ్గరైనంత ఈజీగా కార్యకర్తలు దగ్గరవుతారా? దశాబ్దాల వైరాన్ని మరిచి పని చేస్తారా ? అనేది డౌట్ గానే ఉంది. ఇప్పటికే కొన్ని నియోజకవర్గాల్లో ఇలాంటి లొల్లి వీధికి ఎక్కింది. మహాకూటమిలోని పార్టీల కార్యకర్తలు ఒకరికి మరొకరు సహకరించుకునేది లేదని బహిరంగంగానే చెప్పేస్తున్నారు. కూటమిలో పార్టీలు ఒకరికి ఒకరు పూర్తిస్థాయిలో సహకరిచుకునే పరిస్థితి లేకపోవడంతో కేసీఆర్ చాలా హ్యాపీగా ఉన్నట్టు అర్ధం అవుతోంది. అందుకే ఆయన గెలుపుపై అంత ధీమా వ్యక్తం చేస్తున్నట్టు కనిపిస్తోంది.