బీజేపీతో యుద్దానికి కేసీఆర్ సిద్దమయినట్టేనా ?  

Kcr Wants To Ready To Fight With Bjp Party-kcr,kcr Fight With Bjp Party,ktr,modi,trs

తెలంగాణాలో బీజేపీ బలపడేందుకు ఎంత తీవ్రంగా కృషి చేస్తుందో అంతే స్థాయిలో సభ్యత్వ నమోదు కార్యక్రమాలకు శ్రీకారం చుట్టింది. అన్ని పార్టీల్లో ఉన్న అసంతృప్తులను గుర్తించి తమ పార్టీలోకి తీసుకుంటోంది. అంతే కాదు బీజేపీ లో చేరితే బంగారు భవిష్యత్తు ఖాయం అంటూ ఆశలు పెట్టి మరీ పార్టీలో చేర్చుకుంటున్నారు..

బీజేపీతో యుద్దానికి కేసీఆర్ సిద్దమయినట్టేనా ? -KCR Wants To Ready To Fight With BJP Party

అదే సమయంలో రాబోయే మున్సిపల్ ఎన్నికలను కూడా దృష్టిలో పెట్టుకుని ముందడుగులు వేస్తుంటే ఈ విషయంలో టీఆర్ఎస్ కాస్త వెనుకబడినట్టు కనిపిస్తోంది. తాజాగా పార్టీ నేతలతో జరిగిన సమావేశంలో కూడా బీజేపీ దూకుడుకు సంబంధించి చర్చ జరిగింది. ఈ సందర్భంగా కేసీఆర్ మాట్లాడుతూ బీజేపీ తెలంగాణాలో నిలిచే పార్టీ కాదని, పుల్వా, బాలోకోట్ దాడులను జనాలకి చూపించి సెంటిమెంట్ రెచ్చగొట్టి రెండోసారి గెలిచారు కానీ వారు ప్రజలకు చేసింది ఏమి లేదు అంటూ కేసీఆర్ తీసిపాడేసినట్టుగా మాట్లాడారు.

తెలంగాణాలో టీఆర్ఎస్ పార్టీకి వచ్చిన ఢోకా ఏమీ లేదని, ఇక్కడ టీఆర్ఎస్ చాలా బలంగా ఉందనీ,ఇక్కడ టీఆర్ఎస్ కు తప్ప మిగతా ఏ పార్టీకి స్థానం లేదంటూ కొట్టిపారేశారు. బీజేపీ టీఆర్ఎస్ విషయంలో కక్షసాధింపు చర్యలు చేపట్టినా, కేంద్రం నుంచి నిధులు రాకపోయినా వచ్చిన నష్టం ఏమి లేదు అంటూ చెప్పుకొచ్చారు. మిషన్ కాకతీయ, భగీరథలకు నిధులు ఇవ్వాలని నీతీ ఆయోగ్ చెప్పినా కేంద్రం పట్టించుకోలేదన్నారు. కేంద్రం నుంచి ఒక్క రూపాయి రాకపోయినా రాష్ట్రంలో ఏ అభివృద్ధి పనీ ఆగదని పార్టీ నేతలకు కేసీఆర్ ధైర్యం చెప్పారు.

సీఎం కేసీఆర్ వైఖరి చూస్తుంటే కేంద్రంతో సయోధ్యకి ఆయన ప్రయత్నిస్తున్నట్టుగా కనిపించడంలేదు. తాడో పేడో తేల్చుకునే విధంగానే కేసీఆర్ వ్యవహారం కనిపిస్తోంది..

రాష్ట్రంలో బీజేపీ బలపడటాన్ని కేసీఆర్ చాలా కూల్ గా తీసుకుంటున్నారు.

రాష్ట్రంలో టీఆర్ఎస్ కు ప్రత్యర్థి పార్టీగా బీజేపీ ఎదిగే ప్రయత్నాలు చేస్తున్నా,కేంద్రం నుంచి రాష్ట్రానికి రావాల్సిన నిధులు రాబట్టుకునే విషయంలో కేసీఆర్ తీరు చూస్తుంటే పంతానికి ఎక్కువ ప్రాధాన్యం ఇస్తున్నట్టు కనిపిస్తోంది.అలాగే నీతీ ఆయోగ్ సమావేశానికి వెళ్లకపోవడాన్ని కూడా కేసీఆర్ సమర్థించుకుంటున్నారు. సమాఖ్య స్ఫూర్తి దృష్ట్యా చూసుకుంటే కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల మధ్య ఆహ్లాదకరమైన వాతావరణం ఉండాలి.

కానీ కేసీఆర్ మాత్రం ఆ విధంగా ముందుకు వెళ్లేందుకు సిద్దపడడంలేదు. పైకి గంబీరంగా కేసీఆర్ ఎన్ని మాటలు చెప్పినా బీజేపీ తెలంగాణాలో బలపడడం మాత్రం కేసీఆర్ ను భయపెడుతున్నట్టే కనిపిస్తోంది.