ఆ టైమ్ వచ్చేసిందా ...? మరి గుడ్ న్యూస్ ఎప్పుడు బాస్ ...?

టిఆర్ఎస్ అధినేత తెలంగాణ ముఖ్యమంత్రి కెసిఆర్ ఇప్పుడు పార్టీలో ఉన్న కీలక నాయకులను పరోక్షంగా తెగ ఇబ్బంది పెట్టేస్తున్నాడు.కెసిఆర్ తీరు అర్థం కాక వారు లోలోపల సతమతం అయిపోతున్నారు.

 Kcr Wants To Extend Cabinet For His Government-TeluguStop.com

ప్రభుత్వం ఏర్పడి రెండు నెలలు దాటుతున్నా… ఇప్పటివరకు మంత్రివర్గ విస్తరణపై కేసీఆర్ ఇటువంటి నిర్ణయం తీసుకోలేదు.దానికి సంబంధించిన కసరత్తు చేస్తున్నట్టు కనిపించకపోవడంతో….

ఆశావహులు డీలా పడిపోతున్నారు.అదిగో విస్తరణ అంటే… ఇదిగో విస్తరణ అంటూ… మీడియాలో హడావిడి తప్ప కెసిఆర్ నోటి నుంచి మంత్రివర్గ విస్తరణపై ఒక్క మాట కూడా బయటికి రావడం లేదు.

పోనీ ఎవరెవరికి ఈ మంత్రివర్గంలో చాన్స్ ఉండబోతుంది ఎంతమంది తీసుకుంటారు అటువంటి వివరాలు బయటకు పొక్కకుండా కేసిఆర్ జాగ్రత్త పడుతున్నాడు.

ముహూర్తాలు సెంటిమెంట్లను బలంగా నమ్మే కేసీఆర్ తీరు ఎవరికీ అంతుపట్టడం లేదు.అయితే కొంతలో కొంత ఊరటనిచ్చే అంశం ఏదైనా ఉందా అంటే… అది కేసీఆర్ ఈరోజు గవర్నర్ ను కలవడమే.గవర్నర్ తో భేటీ సందర్భంగా … రాష్ట్ర బడ్జెట్, మంత్రివర్గ విస్తరణ… ప్రమాణ స్వీకారంతో పాటు కొన్ని రాజకీయ అంశాల గురించి చర్చించే అవకాశం ఉన్నట్టు తేలడంతో సంబర పడుతున్నారు.

కేసీఆర్ క్యాబినెట్ లో దాదాపు 10 మంది వరకు అవకాశం ఇవ్వబోతున్నారని అందరూ కొత్తవారే ప్రచారం జరుగుతుండడంతో సీనియర్ మంత్రులు టెన్షన్ పడుతున్నారు.మంత్రివర్గ విస్తరణ కూడా మరింత ఆలస్యం చేయ కుండా రెండు మూడు రోజుల్లోనే చేయబోతున్నట్టు కూడా సమాచారం .

అయితే కెసిఆర్ ఈ మంత్రివర్గ విస్తరణలో ఓ కొత్త వరవడి తీసుకు రాబోతున్నట్టు తెలుస్తోంది.గతంలో ఉన్నట్టుగా ఏ శాఖకు ఆ శాఖ మంత్రిని కాకుండా కొన్ని కీలక శాఖలను అన్నిటినీ కలిపి ఒకే శాఖ గా మార్చాలని కేసీఆర్ భావిస్తున్నాడట.దీనికి సంబంధించిన ఇప్పటికే నివేదికలను కేసీఆర్ కు చీఫ్ సెక్రటరీ అందించారని… ఇవన్నీ పరిగణలోకి తీసుకొని మంత్రివర్గ కూర్పుపై కేసీఆర్ దృష్టి పెడతారని పార్టీ నాయకులు కొందరు చెబుతున్నారు.అది కాకుండా ఈ నెల 22న ఓటాన్ అకౌంట్ బడ్జెట్ ప్రవేశపెట్టాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.

అక్కడి నుంచి 25వ తేదీ వరకు అసెంబ్లీ సమావేశాలు ఉండబోతున్నాయి.ఈ లోపుగానే మంత్రివర్గ విస్తరణ పూర్తి చేసేయాలని చూస్తున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube