ఆ పదవిపై కేసీఆర్ కన్ను ! మోదీతో మంతనాలు అందుకేనా ..?

బీజేపీపై అవకాశం కుదిరినప్పుడల్లా విరుచుకుపడిపోయే కేసీఆర్ కొంతకాలంగా వ్యూహాత్మక మౌనం పాటిస్తున్నాడు.పైకి ఇలాగే వ్యవహరిస్తున్నా .

 Kcr Wants Kk As Rs Deputy Chairman-TeluguStop.com

లోలోపల మాత్రం లోపాయకారి ఒప్పందం ఏదో ఉన్నట్టు చాలాకాలంగా గుసగుసలు వినిపిస్తూనే ఉన్నాయి.ఈ సమయంలోనే ప్రధాని నరేంద్ర మోదీతో కేసీఆర్ భేటీ అవ్వడం ప్రాధాన్యత సంతరించుకుంది.

ఢిల్లీకి వెళ్లిన కేసీఆర్ ప్రధాని మోడీని కలవటం.రాష్ట్రానికి సంబంధించిన అంశాలు.

పెండింగ్ విషయాల మీద చర్చించినట్లుగా వార్తలు వచ్చాయి.కానీ ఇదంతా ఉత్తిదే అని కేసీఆర్ ప్రధానిని కలవడం వెనుక రాజకీయం వేరే ఉందని తెలుస్తోంది.

కేసీఆర్ టూర్ వెనుక అసలు ఉద్దేశం రాజ్యసభ డిప్యూటీ ఛైర్మన్ పదవి అని అది ఎలాగైనా తమ పార్టీకి చెందిన సీనియర్ నేత ఎంపీ కె.కేశవరావుకు ఇచ్చేలా కేసీఆర్ పావులు కదుపుతున్నట్లుగా చెబుతున్నారు.డిఫ్యూటీ ఛైర్మన్ గా వ్యవహరిస్తున్న కురియన్ పదవీ కాలం ముగియబోతుండడంతో రాజ్యసభ డిప్యూటీ ఛైర్మన్ గా బీజేపీయేతర పార్టీకి అవకాశమిస్తే అది తమ పార్టీకి ఇవ్వాల్సిందిగా కేసీఆర్ ప్రధానిని కోరినట్టు సమాచారం.

.

సహజంగా రాజ్యసభ డిప్యూటీ చైర్మన్ పోస్టును విపక్షాలకు ఇస్తూ ఉంటారు.కానీ ఈ విషయంలో సంప్రదాయాలు ఉల్లంఘించేందుకు ప్రధానమంత్రి నరేంద్రమోడీ కసరత్తు మొదలు పెట్టారు అందుకే ఆ పదవిని బీజేపీ లేదా.

తమకు అనుకూలంగా ఉన్న పార్టీల కు ఇచ్చేందుకు ప్రయత్నిస్తున్నారని తెలుస్తోంది.మోడీ దృష్టిలో టీఆర్ఎస్ ప్రముఖంగా ఉంది.

అయితే కేసీఆర్ కూడా ఆ పదవి తమకు వస్తే మరింత బలం వస్తుందనే భావంలో ఉన్నారని డిప్యూటీ చైర్మన్ పదవి కోసం తృణముల్, సమాజ్‌వాదీ పార్టీ నుంచి పోటీ ఉంటుందని భావిస్తున్న టీఆర్‌ఎస్‌ ఆ పార్టీల మద్దతు కోసం కూడా ప్రయత్నిస్తున్నారట.

ప్రస్తుతం రాజ్యసభలో బీజేపీకి పూర్తి స్థాయి మెజారిటీ లేదు.

అభ్యర్థిని డిప్యూటీ చైర్మన్‌గా నెగ్గించుకోవాలంటే బీజేపీ కూటమికి 122 మంది కావాలి.ప్రస్తుతం సభలో ఆ కూటమికి 87 మంది సభ్యులున్నారు.

యూపీఏకు 58 మంది సభ్యులున్నారు .కాబట్టి కాంగ్రెస్, బీజేపీలు ఇతర పార్టీల మద్దతు లేకుండా తమ అభ్యర్థిని డిప్యూటీ చైర్మన్‌గా ఎన్నిక చేసుకోలేరు.

అవసరమైతే టీఆర్‌ఎస్‌ లేదా బీజేడీకి రాజ్యసభ డిప్యూటీ చైర్మన్‌ పదవిని కట్టబెట్టేందుకు ప్రధాని సైతం సముకంగానే ఉన్నట్టు తెలుస్తోంది.ప్రస్తుతం టీఆర్‌ఎస్‌కు రాజ్యసభలో ఆరుగురు, బీజేడీకి తొమ్మిది మంది సభ్యులు ఉన్నారు.

ఈ రెండు పార్టీల్లో ఎవరికైనా డిప్యూటీ చైర్మన్‌ పదవిని ఇవ్వాలనే ఆలోచనలో బీజేపీ ఉంది.కేసీఆర్ మాత్రం ఆ పదవి తమ పార్టీకే వస్తుందనే ధీమాలో ఉన్నాడు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube