ఆ డేటా కేసీఆర్ ఇలా ఉపయోగించుకుంటున్నాడా ..? సీక్రెట్ ఏంటి..?  

Kcr Using Survey Data For 2019 Elections-

రాబోయే ఎన్నికల్లో గెలుపు ధీమా వ్యక్తం చేస్తున్న టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ అందుకు అనుగుణంగా పార్టీని సిద్ధం చేస్తున్నారు.బలమైన ప్రత్యర్థులను ఢీ కొట్టాలంటే పార్టీ ఇమేజ్ తో పాటు పోటీ చేసే అభ్యర్థులు కూడా సమర్ధులై ఉండాలని కేసీఆర్ ఆలోచిస్తున్నాడు.అంతే కాదు ఏ నియోజకవర్గంలో ఏ ఏ పరిస్థితులు ఉన్నాయి..

Kcr Using Survey Data For 2019 Elections--Kcr Using Survey Data For 2019 Elections-

? అక్కడ గెలవాలంటే ఏ ఏ విషయాలు ప్రభావం చూపిస్తాయి వంటి వివరాలతో కేసీఆర్ ముందే ప్రణాలికను సిద్ధం చేసుకున్నాడు.దీనికి తెలంగాణాలో నిర్వహించిన సమగ్ర కుటుంబ సర్వే డేటా ప్రకారం ప్రజలు ఏమి కోరుకుంటున్నారో ముందుగానే తెలుసుకున్నాడు.దానికి అనుగుణంగానే ఇప్పటికే అనేక ప్రజాకర్షక అథకాలకు రూపకల్పన చేసి అమలుచేస్తున్నాడు.

ప్రభుత్వ లోపాలను కూడా సరిద్దితూ ఎన్నికల కోలాహలంలోకి దూసుకెళ్లేందుకు కేసీఆర్ సిద్ధం అవుతున్నాడు.

వచ్చే ఎన్నికల్లో గెలుపు సులభంగా దక్కాలంటే ప్రజల నాది ఎప్పటికప్పుడు తెలుసుకోవాలని కేసీఆర్ ఆలోచన అందుకే.ప్రజా నాడిని తెలుసుకునేందుకు ప్రతి మూడు నెలలకోసారి సర్వే నిర్వహిస్తున్నారు.

ప్రభుత్వ పరంగా ప్రజలు సంతృప్తిని వ్యక్తం చేస్తున్నా సిట్టింగ్ ఎంపీలు, ఎమ్మెల్యేల పనితీరు పట్ల వ్యతిరేకత ఉండటం కేసీఆర్ ను చికాకు పెడుతోంది.అందుకే వ్యతిరేకత ఎక్కువగా ఉన్న సిట్టింగులను మార్చేందుకు సిద్దపడ్డారు.అందు కోసం సమగ్ర కుటుంబ సర్వే సమాచారాన్ని వినియోగించుకుంటున్నారు..

ఈ సమగ్ర సర్వేలో భాగంగా ప్రతి కుటుంబాన్ని ప్రభుత్వం కలిసింది.కులాల వారి సమాచారాన్ని సైతం సేకరించింది.అనుగుణంగా చేపట్టిన గొర్రెల పంపిణి, చేపల పంపిణి, ఎంబీసీ కార్పోరేషన్ ఏర్పాటు, ఎంబీసీ కులాల జాబితా వంటి కార్యక్రమాలు ప్రజలకు చేరువ అయ్యాయి.

అందుకే అభ్యర్ధుల ఎంపిక కోసం సమగ్ర కుటుంబ సర్వే సమాచారాన్ని కేసీఆర్ నిశితంగా అధ్యయనం చేస్తున్నారు కేసీఆర్.సమగ్ర సర్వే సమాచారాన్ని బయటపెట్టాలని విపక్షాలు డిమాండ్ చేస్తున్నా ప్రభుత్వం మాత్రం గోప్యంగా ఉంచుతోంది.తద్వారా సమగ్ర సర్వే ప్రయోజనాలు మొత్తం తనకు దక్కేలా వ్యూహరచన చేసింది.

అభ్యర్ధులను మార్చితే ఏ సామాజిక వర్గం అక్కడ బలంగా ఉంది, ఏ కూలానికి టికెట్ ఇస్తే గెలిపించుకోవడం సునాయసమవుతుందన్న మొత్తం సమాచారాన్ని సమగ్ర కుటంబ సర్వే నుంచే సేకరిస్తోంది.అందులో భాగంగా పలువురు ఎంపీలు, ఎమ్మెల్యేల నియోజకవర్గాలు మారే అవకాశం ఉందనే ప్రచారం సాగుతోంది.