తెలంగాణ ఆరోగ్య శాఖ మంత్రిగా కేసీఆర్.. ఈటెల అవుట్..!!

నిన్నటి దాకా తెలంగాణ రాష్ట్రానికి ఆరోగ్య శాఖ మంత్రిగా వ్యవహరించిన ఈటెల రాజేందర్ పై అనేక భూకబ్జా ఆరోపణలు రావడంతో ఆయనపై వేటు పడింది.మెదక్ జిల్లా మూసాపేట మండలం అచ్చంపేట, హకీంపేట లో ఈటెల రాజేందర్ భూకబ్జాలకు పాల్పడ్డారు అనే ఆరోపణలు వరుసగా రావటంతో నిన్న కలెక్టర్ చేత సీఎం కేసీఆర్ విచారణ కు ఆదేశాలు ఇవ్వడం జరిగింది.

 Now Kcr Turns To Health Minister To Telangana State ,eetela Rajender, Kcr, Kcr A-TeluguStop.com

ఈ క్రమంలో భూములను పరిశీలించిన విజిలెన్స్ డీజీ పూర్ణ చంద్ర రావు దగ్గరికి బాధితులు క్యూ కట్టారు.దీంతో అసైన్డ్ భూములను కబ్జా చేశారని ప్రాథమిక విచారణలో తేలినట్లు మెదక్ కలెక్టర్ హరీష్ స్పష్టం చేశారు.

ఈ క్రమంలో బాధితులకు అన్యాయం జరిగినట్లు పేర్కొన్నారు.డిజిటల్ సర్వే పూర్తికాగానే మొత్తం నివేదిక ప్రభుత్వానికి అందించనున్నట్లు క్లారిటీ ఇచ్చారు.

  దీంతో ఆరోగ్య శాఖ మంత్రిగా ఉన్న ఈటెల పై వేటు పడింది.ఇదిలా ఉంటే ఇప్పుడు ఆరోగ్య శాఖ మంత్రి గా కేసీఆర్ ని నియమిస్తూ.తెలంగాణ గవర్నర్ ఆదేశాలు జారీ చేయడం జరిగింది.ఈ పరిణామంతో ఒకపక్క ముఖ్యమంత్రిగా మరోపక్క ఆరోగ్యశాఖ మంత్రిగా కేసీఆర్ రాణిస్తున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube