ప్రధాని తో కేసీఆర్ ? ఈ ఆకస్మిక నిర్ణయం ఏంటంటే ? 

తెలంగాణలో టిఆర్ఎస్ బిజెపి మధ్య ఎంత శత్రుత్వం ఉందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు.ప్రస్తుతం తెలంగాణలో అధికార పార్టీగా ఉన్న టిఆర్ఎస్ ను ఓడించి తాము అధికారంలోకి రావాలన్న పట్టుదలతో తెలంగాణ బిజెపి నాయకులు ప్రయత్నాలు చేస్తుండగా,  అంతే స్థాయిలో బీజేపీ ని తెలంగాణలో బలోపేతం చేసేందుకు టిఆర్ఎస్ ప్రయత్నాలు చేస్తోంది.

 Telangana Cm Kcr Keep Trying To Meet Pm Narendra Modi, Prime Minister, Narendra-TeluguStop.com

ఇదే సమయంలో హుజురాబాద్ ఎన్నికలు అనివార్యం కావడంతో,  ఇక్కడ ప్రధాన పోటీ బిజెపి టిఆర్ఎస్ మధ్య నెలకొంది.ఈ సందర్భంగా ఒక పార్టీపై మరో పార్టీ తీవ్ర స్థాయిలో విమర్శలు చేసుకుంటూ ఎన్నికల ప్రచారాన్ని నిర్వహిస్తున్నాయి.

ఇంతవరకు ఈ వ్యవహారం ఇలా ఉన్నా,  కేసీఆర్ మాత్రం బిజెపి విషయంలో భిన్న వైఖరితోనే ఉంటూ వస్తున్నారు.

తెలంగాణలో మాత్రమే బీజేపీతో తమకు శత్రుత్వం ఉందని , బీజేపీ జాతీయ నేతలతో తనకు ఎటువంటి వైరం లేదు అన్నట్లుగా అన్ని వ్యవహారాలు చేస్తూ ఉంటారు.

ఒకపక్క ఏపీ బీజేపీ నేతలను విమర్శిస్తూనే,  మరోపక్క కేంద్ర బిజెపి పెద్దలను పొగుడుతూ సరి కొత్త రాజకీయానికి కెసిఆర్ తీస్తూ ఉంటారు.తాజాగా ఢిల్లీలో టీఆర్ఎస్ కార్యాలయం శంకుస్థాపన కార్యక్రమానికి కెసిఆర్ హాజరయ్యారు.

ఈ సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీ తో భేటీ అయ్యేందుకు కేసీఆర్ చాలా ప్రయత్నాలు చేసినట్లు తెలుస్తోంది.
  పీఎంవో నుంచి కూడా కేసీఆర్ కు అపాయింట్ మెంట్ ఇచ్చే విషయంలో సానుకూలత ఉండడం తో అతికొద్ది రోజుల్లోనే ప్రధాని నరేంద్ర మోదీ తో కేసీఆర్ భేటీ అయ్యే అవకాశం కనిపిస్తోంది.

Telugu @pmo, Hujurabad, Narendra Modi, Prime, Prime India, Telangana, Telangana

అయితే ఉన్నట్టుండి కేసీఆర్ ప్రధానిని ఎందుకు కలవాలి అనుకుంటున్నారు అనే విషయంలో ఎవరికీ స్పష్టత లేదు.కాకపోతే హుజురాబాద్ ఉప ఎన్నికల్లో టీఆర్ఎస్ అభ్యర్థి గనుక గెలిస్తే , వచ్చే ఏడాది ఆగస్టులో కేసీఆర్ ఉప ఎన్నికలకు వెళ్ళలని, అలా వెళ్లాలంటే కేంద్ర ప్రభుత్వం సహకారం తప్పనిసరిగా ఉండాలని , దీని కోసమే ప్రధాని నరేంద్ర మోడీ తో కేసీఆర్ భేటీ అవుతున్నారని ప్రచారం జరుగుతోంది.2018 ఎన్నికల్లో కేసీఆర్ ముందస్తు ఎన్నికలకు వెళ్లారు.అప్పట్లో బిజెపి పెద్దలు కెసిఆర్ కు అన్ని విధాలుగా సహకరించారు.

ఇప్పుడు ఆ సహకారం కోసమే ప్రదనితో కేసీఆర్ భేటీ కాబోతున్నట్లు టీఆర్ఎస్ వర్గాల ద్వారా తెలుస్తోంది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube