కేసిఆర్ ఆ రాంగ్ స్టెప్ ? బెడిసికొట్టిన ఫలితం ?

తెలంగాణ సీఎం కేసీఆర్ అన్ని విషయాలలోనూ అప్రమత్తంగా నే ఉంటూ, ఏ విషయంలోనూ విమర్శల పాలు కాకుండా పైచేయి సాధించడం లో వస్తున్నారు రాజకీయ ప్రత్యర్ధులకు తమను విమర్శించే అవకాశం లేకుండా చేసేందుకు కెసిఆర్ ప్రయత్నిస్తూ ఎదురు లేకుండా చేసుకుంటూ వస్తున్నారు.2014 ఎన్నికలలోనే కాకుండా 2018 లో జరిగిన ముందస్తు ఎన్నికలలోనూ తమ సత్తా చాటుకున్నారు.కాంగ్రెస్ ను బలహీనం చేయడమే ఏకైక అజెండాగా పనిచేస్తూ వచ్చారు.ఆ విషయంలో సక్సెస్ అయ్యారు.

 Kcr Troubled On Bjp Leaders Behaviour, Bjp, Dubbaka, Elections, Ghmc, Greater, K-TeluguStop.com

ఇంత వరకు బాగానే ఉన్నా , తెలంగాణలో కాంగ్రెస్ ఇప్పుడు అయితే బలహీనపడిందొ ఇక అప్పటి నుంచి బిజెపి తమ బలం పెంచుకుంటూ వచ్చింది.2019లో జరిగిన పార్లమెంట్ ఎన్నికల్లో బిజెపి ప్రభావం కనిపించింది.అయితే ఈ విషయాన్ని కేసీఆర్ లైట్ తీసుకుని కాంగ్రెస్ పై తప్ప బిజెపి పెద్దగా దృష్టి సారించ లేకపోయారు.ఈ మధ్యకాలంలో తెలంగాణ బిజెపి అధ్యక్షుడు గా బండి సంజయ్ నియామకం అయిన తరువాత టీఆర్ఎస్ ను పూర్తిగా ఇబ్బంది పెట్టడమే ఏకైక  లక్ష్యంగా ముందుకు వెళుతూ,  బీజేపీని బలోపేతం చేయడంలో  సక్సెస్ అయ్యారు.

Telugu Dubbaka, Ghmc, Greter, Mayer, Sanjay, Telangana-Telugu Political News

ఇక దుబ్బాక  ఉప ఎన్నికలలో బిజెపి సత్తా చాటడంతో  కంగారు మొదలైంది.అయితే గ్రేటర్ లో బిజెపి ప్రభావం పెద్దగా ఉండదు అని అంచనా వేసిన కేసిఆర్ కు ఫలితాలు మింగుడు పడని విధంగా వచ్చాయి.ఇప్పుడు బిజెపి అకస్మాత్తుగా బలం పుంజుకుని సవాల్ విసరడం టిఆర్ఎస్ కు ఇబ్బందికరంగా మారింది.అయితే ఇదంతా కాంగ్రెస్ ను బలహీన చేయడం కారణంగానే కనిపిస్తోంది.బిజెపి ఈ స్థాయిలో ప్రభావం చూపించడం అషమాషి వ్యవహారం కాదు అనే విషయం టిఆర్ఎస్ కు అర్థమైంది.అయితే చేతులు కాలాక ఆకులు పట్టుకున్న చందంగా నష్టనివారణ చర్యలకు దిగుదామని టిఆర్ఎస్ ప్రయత్నిస్తున్న,  ఇప్పటికే బిజెపి జనాల్లోకి వెళ్లిపోవడం రాబోయే సార్వత్రిక ఎన్నికల్లో సత్తా చాటుకునే స్థాయికి వెళ్లడం ఎలా ఎన్నో అంశాలు కెసిఆర్ కంగారు పుట్టిస్తున్నాయి.

తెలంగాణలో ప్రభుత్వం కు ఇబ్బంది లేదు అని,  రాబోయే ఎన్నికల్లో తమ సత్తా చాటుతామని కేసీఆర్ ఢిల్లీ రాజకీయాలపై దృష్టి పెడదామని చూస్తున్న సమయం లో  ప్రస్తుతం నెలకొన్న పరిస్థితులు చూస్తుంటే పూర్తిగా తెలంగాణ రాజకీయాల పైన దృష్టి పెట్టాల్సిన పరిస్థితి కనిపిస్తోంది.అసలు ఈ వ్యవహారం అంతా జరగడానికి ప్రధాన కారణం కాంగ్రెస్ తెలంగాణలో ప్రభావం కోల్పోవడమే.

ఆ పార్టీని ఆ స్థాయికి దిగజార్చిన కెసిఆర్ ఇప్పుడు మూల్యం చెల్లించుకున్నన్నట్టుగా కనిపిస్తున్నారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube