భారీ వ్యూహరచన దిశగా కెసీఆర్...అసలు టార్గెట్ ఇదేనా

తెలంగాణలో రాజకీయ పరిణామాలపై రానున్న రోజుల్లో కెసీఆర్ ఇక ప్రత్యేక దృష్టి సారించనున్నట్లు తెలుస్తోంది.తాజాగా జరిగిన విలేఖరుల సమావేశంలో కెసీఆర్ వరి ధాన్యం కొనుగోలు చేయకపోతే బీజేపీ పై పోరాటానికి సమర శంఖం పూరిస్తామని వ్యాఖ్యానించిన విషయం తెలిసిందే.

 Kcr Towards A Huge Strategy Is This The Real Target Details, Kcr, Trs Party, Kcr-TeluguStop.com

అయితే కేంద్రం నుండి తెలంగాణ లో పండిన వరి ధాన్యాన్ని పూర్తి స్థాయిలో కొనుగోలు చేస్తామని కేంద్రం నుండి లేఖను ఇప్పించాలని కెసీఆర్ చేసిన ఛాలెంజ్ కు బీజేపీ పార్టీ స్పందించలేదు.అంతేకాక తాజాగా నల్గొండలో పర్యటించి శాంతిభద్రతల సమస్య సృష్టించాలని బీజేపీ ప్రయత్నించిందని టీఆర్ఎస్ పెద్ద ఎత్తున ఆరోపిస్తున్న నేపథ్యంలో కెసీఆర్ బీజేపీ దూకుడుకు అడ్డుకట్ట వేయడానికి భారీ వ్యూహ రచనకు సిద్దమైనట్టు తెలుస్తోంది.

రైతులపై దాడి చేయడంపై కెసీఆర్ తీవ్ర ఆగ్రహంగా ఉన్నారని త్వరలో బీజేపీకి తగిన మూల్యం చెల్లించుకుంటుందని, రాజకీయ స్వార్థం కోసం ఏమైనా చేస్తారా అంటూ టీఆర్ఎస్ నేతలు మండిపడుతున్నారు.అయితే నేడు భవిష్యత్ కార్యాచరణపై శాసనాసభ పక్ష సమావేశం నిర్వహిస్తున్న విషయం తెలిసిందే.

Telugu @bandisanjay_bjp, @bjp4telangana, @cm_kcr, @trspartyonline, Bandi Sanjay,

అయితే ఈ సమావేశంలో బీజేపీ దూకుడును అడ్డుకోవడానికి చేయవలసిన పనులను, రైతులపై దాడికి దిగడంపై భారీ వ్యూహాన్ని కూడా కెసీఆర్ ఎమ్మెల్యేలు తెలిపే అవకాశం ఉంది.శాసనసభా పక్ష సమావేశం తరువాత కెసీఆర్ విలేఖరుల సమావేశం నిర్వహిస్తారా లేదా అన్నది ఇప్పటికైతే క్లారిటీ లేనప్పటికీ ప్రెస్ నోట్ విడుదల చేసే అవకాశం మాత్రం ఉంది.అయితే ఇక కెసీఆర్ బహిర్గతం చేయని వ్యూహంతో ఇక బీజేపీని శాశ్వతంగా ఇరుకునపెట్టే అవకాశం ఉండవచ్చని కెసీఆర్ రాజకీయ వ్యూహాల గురించి తెలిసిన రాజకీయ విశ్లేషకులు అభిప్రాయ పడుతున్నారు.ఏది ఏమైనా ఇక రానున్న రోజుల్లో బీజేపీ భరతం పట్టే ఆలోచనలో కెసీఆర్ ఉన్నట్లు ప్రస్తుతం కెసీఆర్ కదలికలను బట్టి మనకు అర్ధమవుతోంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube