కేసీఆర్ పర్యటన.. కామారెడ్డిలో విద్యార్థి సంఘాలు అరెస్టు..!

తెలంగాణా సీఎం కే.సి.

 Kcr Tour Police Arrest Student Leaders-TeluguStop.com

ఆర్ సిద్ధిపేట జిల్లా పర్యటన చేయనున్నారు.సిద్ధిపేట, కామారెడ్డి జిల్లాల పర్యటనకు షెడ్యూల్ చేసుకున్నారు.

  కే.సి.ఆర్ ముందు సిద్ధిపేట జిల్లాలో పర్యటించి ఆ తర్వాత కామారెడ్డి వెళ్లనున్నారు.ఈ క్రమంలో ఆయా ప్రాంతాల్లో కే.సి.ఆర్ పర్యటనకు అడ్డంకులు ఏర్పరచుకుండా పోలీసులు ముందస్తు అరెస్టులను చేస్తున్నారు.కే.సి.ఆర్ పర్యటనని అడ్డుకుంటామని విద్యార్ధి జే.ఏ.సి నాయకులు హెచ్చరించారు.ఈ నేపథ్యంలో పోలీసులు వారిపై చర్యలు తీసుకుంటున్నారు.

 Kcr Tour Police Arrest Student Leaders-కేసీఆర్ పర్యటన.. కామారెడ్డిలో విద్యార్థి సంఘాలు అరెస్టు..-Breaking/Featured News Slide-Telugu Tollywood Photo Image-TeluguStop.com

కామారెడ్డిలో బీజేపీ, కాంగ్రెస్ కు సంబందించిన విద్యార్ధి సంఘ నేతలను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.ఈ పర్యటనలో భాగంగా కే.సి.ఆర్ సిద్దిపేట నూతనంగా నిర్మించిన ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం, పోలీస్ కమీషనర్ కార్యాలయం ప్రారంభిస్తారు.అక్కడ అధికారులు, ప్రజా ప్రతినిధులతో సమావేశమవుతారు.

ఆ తర్వాత కామారెడ్డి జిల్లాకు చేరుకుని సమీకృత కలెక్టరేట్, ఎస్పీ కార్యలయాన్ని ప్రారంభిస్తారు.

దానితో పాటుగా పలు గ్రామాల్లో తనిఖీలు నిర్వహిస్తారని తెలుస్తుంది.సోమవారం నాడు వరంగల్ జిల్లా పర్యటనకు వెళ్లి కాళోజీ యూనివర్సిటీ, వరంగల్ అర్బన్ కలెక్టరేట్ల భవనాలను ప్రారంభిస్తారు.

ఇక సెంట్రల్ జైలు ప్రాంగణంలో ఏర్పరుస్తున్న మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ భవన నిర్మాణానికి భూమి పూజ చేస్తారు. రెండు మూడు రోజుల సీఎం పర్యటన కారణంగా ఎక్కడికక్కడ పోలీసులు కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు.

విద్యార్ధి నాయకులు ఎలాంటి గొడవ చేయకుండా ముందుగా అరెస్ట్ చేస్తున్నారు.

#Telangana #Siddhipet #Tour #Students Arres #Sangareddy

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు