టీడీపీకి కేసీఆర్ రిటర్న్ గిఫ్ట్ ఇస్తే... కేసీఆర్ కి తెలంగాణ ప్రజలు రిటర్న్ గిఫ్ట్  

టీఆర్ఎస్ పార్టీకి రిటర్న్ గిఫ్ట్ ఇచ్చిన తెలంగాణ ప్రజలు. .

Kcr Took Return Gift From Telangana People-congress,kcr Took Return Gift,telangana People,trs

తెలంగాణలో ముందస్తు అసెంబ్లీ ఎన్నికలకి వెళ్లి ఊహించని స్థాయిలో వందకి పైగా స్థానాలు సొంతం చేసుకొని తెలంగాణలో అధికారంలోకి వచ్చిన టీఆర్ఎస్ పార్టీ గెలిచినా తర్వాత ప్రతిపక్ష లేకుండా చేసుకోవాలని కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలని పార్టీలో కలిపెసుకున్నారు. తెలంగాణలో తమ పార్టీకి అసలు పోటీనే లేకుండా చేసుకోవాలని ప్రయత్నం చేస్తూ, కాంగ్రెస్ పార్టీని భూస్థాపితం చేసే ప్రయత్నం టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ చేసారు. అయితే అసెంబ్లీ ఎన్నికల తర్వాత పార్లమెంట్ ఎన్నికలలో రాణే వచ్చాయి..

టీడీపీకి కేసీఆర్ రిటర్న్ గిఫ్ట్ ఇస్తే... కేసీఆర్ కి తెలంగాణ ప్రజలు రిటర్న్ గిఫ్ట్-KCR Took Return Gift From Telangana People

తెలుగు దేశం పార్టీ తెలంగాణలో తమని ఓడించే ప్రయత్నం చేసింది అని ఫిక్స్ అయిన కేసీఆర్ ఏపీలో బాబుకి రిటర్న్ గిఫ్ట్ ఇస్తానని చెప్పుకొచ్చారు. అందుకు తగ్గట్లుగానే వైసీపీకి వెనకుండి పోత్సాహం అందించారు. ఇక తెలంగాణలో జరిగిన లోక్ సభ ఎన్నికలలో 16 స్థానాలని సొంతం చేసుకొని క్లీన్ స్వీప్ చేసి జాతీయ రాజకీయాలలో సత్తా చాటాలని కేసీఆర్ వ్యూహాత్మక అడుగులు వేసాడు. అయితే ఊహించని విధంగా టీఆర్ఎస్ కి తెలంగాణ లోక్ సభ ఎన్నికలలో ప్రజల నుంచి రిటర్న్ గిఫ్ట్ అందింది అని చెప్పాలి.

కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలని తన పార్టీలో కలిపేసుకున్న టీఆర్ఎస్ పార్టీ పట్ల తమ వ్యతిరేకతని ప్రజలు లోక్ సభ ఫలితాలలో స్పష్టంగా చూపించారు. టీఆర్ఎస్ ని కేవలం 9 స్థానాలకే పరిమితం చేసారు. ఇక కాంగ్రెస్ పార్టీ నుంచి అసెంబ్లీ ఎన్నికలలో ఓడిపోయినా ఉత్తమ్ కుమార్, రేవంత్ రెడ్డి, కోమటిరెడ్డిని ఎంపీలుగా గెలిపించారు.