షూటింగ్‌లకు కేసీఆర్ గ్రీన్ సిగ్నల్.. కానీ!  

Kcr Tollywood News Chirajeevi - Telugu Chirajeevi, Kcr, Shooting, Tollywood News

ప్రస్తుతం ప్రపంచాన్ని కరోనా వైరస్ గడగడలాడిస్తున్న క్రమంలో పలు దేశాలు పూర్తి స్థాయి లాక్‌డౌన్‌ను అమలు చేస్తున్నాయి.ఇందులో భాగంగా భారతదేశంలో కూడా ప్రభుత్వం గత రెండు నెలలకు పైగా లాక్‌డౌన్‌ను విధించడంతో దేశవ్యాప్తంగా అన్ని పనులు స్తంభించాయి.

 Kcr Tollywood News Chirajeevi

ఇందులో సినీ రంగానికి చెందిన అన్ని పనులు కూడా స్తంభించాయి.కాగా రెండు నెలలకు పైగా షూటింగ్‌లు లేకపోవడంతో పేద సినీ కార్మికులు నానా ఇబ్బందులు పడుతున్నారు.

అయితే ఇన్ని రోజులుగా సినిమా రంగంలో పనులు నిలిచిపోవడంతో కార్మికులు ఇబ్బందులు పడుతున్నారని, చిత్ర నిర్మాతలు చాలా నష్టాలను ఎదుర్కొంటున్నారని మెగాస్టార్ చిరంజీవి అధ్యక్షతన పలువురు సినీ ప్రముఖులు తెలంగాణ సీఎం కేసీఆర్‌ను కలిశారు.సినిమాటోగ్రఫీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ఆధ్వర్యంలో ఈ సమావేశం జరగ్గా, సినిమా రంగానికి సంబంధించి పలు సమస్యలను సీఎం ముందు ఉంచారు.

షూటింగ్‌లకు కేసీఆర్ గ్రీన్ సిగ్నల్.. కానీ-Breaking/Featured News Slide-Telugu Tollywood Photo Image

కాగా ఈ సమావేశంలో సినీ ప్రముఖల విన్నపాలను సీఎం చాలా ఓపికగా విన్నారని, ప్రస్తుతం ఉన్న పరిస్థితుల దృష్ట్యా తగిన జాగ్రత్తలు తీసుకుంటూ ఇండోర్ షూటింగ్‌లను అతి తక్కువ మందితో జరుపుకునేందుకు సీఎం గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు తెలుస్తోంది.అయితే సీఎం కేసీఆర్ షూటింగ్ విషయాల్లో పలు కీలక సూచనలు చేశారని సినీ వర్గాలు తెలిపాయి.

మొత్తానికి సినీ రంగానికి ఇదొక తీపి కబురనే చెప్పాలి.మరి దర్శకనిర్మాతలు సినిమా షూటింగ్ విషయాల్లో ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటారు, షూటింగ్‌లలో సామాజిక దూరం పాటిస్తారా లేదా అనేది వేచి చూడాలి.

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు

Kcr Gives Green Signal For Tollywood Shootings Related Telugu News,Photos/Pics,Images..