కేసీఆర్ వచ్చేస్తున్నారా ? విమర్శలకు సమాధానం ఇచ్చేస్తున్నారా ?  

Telangana CM KCR, CM KCR, Social Media, RTC Workers Issue, Lockdown, Corona Effect, KCR to give Interview - Telugu Cm Kcr, Corona Effect, Kcr To Give Interview, Lockdown, Rtc Workers Issue, Social Media, Telangana Cm Kcr

కేసీఆర్ ఎక్కడ ఎక్కడ అంటూ కొద్దిరోజులుగా తెలంగాణలో పెద్ద నినాదమే సోషల్ మీడియాలో జరుగుతోంది.కేసీఆర్ ఆచూకీ చెప్పాలంటూ పెద్ద ఎత్తున ట్రోల్స్ నడుస్తున్నాయి.

 Kcr To Give Interview Social Media

ప్రస్తుతం తెలంగాణ లో కరోనా వైరస్ వ్యాధి తీవ్రస్థాయిలో విజృంభిస్తున్న సమయంలో, ప్రజలకు భరోసా కల్పించే విధంగా వ్యవహరిస్తూ, అధికారులను ఎప్పటికప్పుడు అప్రమత్తం చేస్తూ, కీలక నిర్ణయాలు తీసుకోవాల్సి ఉన్నా, ఎవరికీ అందుబాటులో లేకుండా, అసలు ఆయన ఎక్కడున్నారు ? ఏం చేస్తున్నారు ? ఎందుకు అజ్ఞాతంలో ఉన్నారు అనే విషయం తెలియనివ్వకుండా, కెసిఆర్ వ్యవహరిస్తున్న తీరుపై ఆయన రాజకీయ ప్రత్యర్ధులు పెద్ద ఎత్తున విమర్శలు చేస్తున్నారు.

ఈ విమర్శలు మరి శృతిమించడంతో, త్వరలోనే కేసీఆర్ తెర ముందుకు వచ్చేందుకు సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది.

కేసీఆర్ వచ్చేస్తున్నారా విమర్శలకు సమాధానం ఇచ్చేస్తున్నారా -Political-Telugu Tollywood Photo Image

ఇప్పటి వరకు మూటగట్టుకున్న అపఖ్యాతి మొత్తం పటాపంచలు అయ్యేలా కెసిఆర్ సరికొత్త విధంగా ప్రత్యర్థులపై విరుచుకు పడేందుకు సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది.గతంలో ఆర్టీసీ కార్మికుల సమ్మె విషయంలో కేసీఆర్ ఎన్నో విమర్శలు ఎదుర్కొన్నారు.

సుమారు 50 రోజులకు పైగా ఈ వ్యవహారంపై కేసీఆర్ నోరు మెదపలేదు.ఈ వ్యవహారంలో కోర్టు లు సైతం కేసీఆర్ తీరును తప్పు పట్టాయి.

ఆ తరువాత ఒక్కసారిగా ఆర్టీసీ కార్మికులకు వరాలు ప్రకటించి, తమ పై కత్తి కట్టిన కార్మిక సంఘాలను ఆర్టీసీలో లేకుండా చేసుకోగలిగారు కేసీఆర్.

ఇప్పుడు 13 రోజులుగా కేసీఆర్అజ్ఞాతం లోనే ఉన్నా, ఒక్క సారిగా ఆయన బయటకు వచ్చి మొత్తం తనపై సానుకూలత పెరిగే విధంగా చేసుకునేందుకు అన్ని ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలుస్తోంది.

ప్రస్తుతం కెసిఆర్ కుమారుడు, మంత్రి కేటీఆర్ కూడా వ్యూహాత్మకంగానే మౌనం పాటిస్తున్నారు.ఎప్పుడు సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటూ అందరి ప్రశ్నలకు సమాధానాలు చెబుతూ వచ్చే కేటీఆర్ ఈ విషయంలో ఇంత రాద్దాంతం జరుగుతున్నా, నోరు మెదపకపోవడానికి కారణం వ్యూహాత్మకామినేని, పార్టీలో చర్చ జరుగుతోంది.

మరో మూడు రోజుల్లో కేసీఆర్ మీడియా ముందుకు రాబోతున్నట్లు టిఆర్ఎస్ పార్టీలో పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది.

#Lockdown #Social Media #Corona Effect #CM KCR

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు

Kcr To Give Interview Social Media Related Telugu News,Photos/Pics,Images..