కలవరపెడుతున్న సర్వేలు ? కేసీఆర్ టెన్షన్ ఏంటి ?

తెలంగాణలో టిఆర్ఎస్ పరిస్థితి ఏంటి అనే విషయంలో ఆ పార్టీ అధినేత కేసీఆర్ టెన్షన్ పడుతున్నట్టుగా కనిపిస్తున్నారు.ఇప్పటికే రెండుసార్లు పార్టీని ప్రజలు అధికారంలోకి వచ్చేలా చేసినా, మూడో సారి మాత్రం ఆ పరిస్థితి లేదు అన్నట్టుగానే ఈ వ్యవహారం చోటుచేసుకోవడం కెసిఆర్ ను మరింత కలవరానికి గురిచేస్తున్నాయి.

 Telangana Cm, Kcr, Trs, Hujurabad, Trs Mlas, Telangana Government, Bjp, Congress-TeluguStop.com

కొద్ది నెలల క్రితం వరకు కెసిఆర్ చాలా ధీమాగానే ఉండేవారు.పార్టీ, ప్రభుత్వ కార్యక్రమాల్లో పాల్గొనేందుకు పెద్దగా ఆసక్తి చూపించేవారు కాదు.

ఎక్కువగా ఫామ్ హౌస్ లో విశ్రాంతి తీసుకుంటూ గడిపే వారు.అయితే ఇంటెలిజెన్స్ నివేదికలు, వివిధ సర్వేల రిజల్ట్ ప్రకారం టిఆర్ఎస్ కు గడ్డు పరిస్థితి ఏర్పడుతోందని, రాబోయే ఎన్నికల్లో ఘోర పరాభవం తప్పదని నివేదికలు కేసీఆర్ ను టెన్షన్ పడుతున్నట్లు తెలుస్తోంది.

సార్వత్రిక ఎన్నికలకు ఇంకా 27 నెలల సమయం ఉన్నప్పటికీ, కేసీఆర్ లో మాత్రం ఇప్పుడే టెన్షన్ మొదలైనట్లుగా కంగారు పడుతున్నారు.టిఆర్ఎస్ ప్రభుత్వం పై ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత ఉందని, చాలా జాగ్రత్తగానే వ్యవహారాలు చేయకపోతే ఘోరంగా దెబ్బతినాల్సి వస్తుందనే విషయాన్ని కేసీఆర్ పదే పదే గుర్తు చేసుకుంటున్నారు.

అసలు 2023 లో జరగబోయే సార్వత్రిక ఎన్నికల్లో టిఆర్ఎస్ పరిస్థితి ఏ విధంగా ఉందనేది వివిధ సర్వే ఏజెన్సీలు నివేదిక ఇవ్వడం తో కేసీఆర్ మరింత కంగారుకు గురవుతున్నారు.చాలా చోట్ల ఎమ్మెల్యేల పనితీరుపై ప్రజలు తీవ్ర అసంతృప్తితో ఉన్నారని, ప్రభుత్వ విధానాలు జనాలకు రుచించడం లేదని, అన్ని అంశాలపై నివేదికలు అందడంతో కేసీఆర్ టెన్షన్ పడుతున్నట్టుగా కనిపిస్తున్నారు.

ఈ మేరకు అన్ని నియోజకవర్గాల్లోనూ కొత్త ఇన్చార్జిలను నియమించి, పార్టీకి ఎటువంటి ఇబ్బంది లేకుండా చేసుకునేందుకు ప్రయత్నాలు మొదలుపెట్టారట.అలాగే చాలా మంది టిఆర్ఎస్ ఎమ్మెల్యేలు, కీలక నాయకులు బిజెపి కాంగ్రెస్ లో చేరేందుకు సిద్ధమవుతున్నారనే నివేదికలు కలవరం పుట్టిస్తున్నాయి.

Telugu Congress, Hujurabad, Kcr, Telangana Cm, Telangana, Trs Mlas-Telugu Politi

2018 లో జరిగిన ముందస్తు ఎన్నికల్లో పాత వారికి కెసిఆర్ టికెట్లు ఇచ్చినా, ఇప్పుడు ఆ పరిస్థితి లేదని, మెజారిటీ ఎమ్మెల్యేల తీరుపై తీవ్ర అసంతృప్తి ఉందని, వారికి టిక్కెట్లు ఇస్తే మొదటికే మోసం వస్తుందని నివేదికలు మరింత కలవరానికి గురిచేస్తున్నాయి.ఇప్పుడు ప్రజావ్యతిరేకత ఎదుర్కొంటున్న టిఆర్ఎస్ ఎమ్మెల్యేల స్థానంలో కొత్త ఇన్చార్జిలను పార్టీ తరపున నియమించి, రాబోయే ఎన్నికల్లో వారికి టిక్కెట్లు ఇస్తే ఎలా ఉంటుందనే విషయంపై కేసీఆర్ కసరత్తు చేస్తున్నట్లు తెలుస్తోంది.టిఆర్ఎస్ ప్రభుత్వం పై తీవ్ర వ్యతిరేకత ఉందనే విషయం హుజురాబాద్ ఎన్నికల ద్వారా తేలితే, మళ్లీ అధికారంలోకి రావడం కష్టమనే ఉద్దేశంతోనే ఈ నియోజకవర్గంలో గెలుపు కోసం కేసీఆర్ తో పాటు, ఆ పార్టీ నాయకులు తీవ్రంగా కష్టపడుతున్నట్టుగా కనిపిస్తున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube