కేసీఆర్ లో ఈ కంగారు ఎందుకో ? 

టిఆర్ఎస్ అధినేత తెలంగాణ సీఎం కేసీఆర్ వైఖరి ఏమిటనేది ఆ పార్టీ నాయకులు సైతం అంతుపట్టదు.సమయానుకూలంగా నిర్ణయాలు మార్చుకుంటూ, ఫలితాన్ని ఎప్పుడూ తమకు అనుకూలంగా ఉండేలా చేసుకోవడంలో కేసీఆర్ సిద్ధహస్తులు.

 Kcr Tention On Telangana Political Issues, Telangana Cm Kcr, Ktr, Hujurabad, Trs-TeluguStop.com

అయితే గతంలో మాదిరిగా కేసీఆర్ ఫామ్ హౌస్ కే పరిమితం కాకుండా, యాక్టివ్ గా రాజకీయాలు చేస్తున్నారు.తెలంగాణ అంతటా విస్తృతంగా పర్యటనలు, సభలు, సమావేశాలు నిర్వహిస్తూ, పార్టీలోనూ జోష్ నింపుతూ ప్రభుత్వంపై ప్రజల్లో సానుకూల దృక్పథం ఏర్పడే విధంగా కెసిఆర్ వ్యవహరిస్తున్నారు.

దీనికి వివిధ సర్వేలు కారణంగా కనిపిస్తున్నాయి.

ప్రజల్లో టిఆర్ఎస్ ప్రభుత్వం పై వ్యతిరేకత పెరిగిందని,  ఇంటెలిజెన్స్ వర్గాల ద్వారా తెలుసుకున్న కేసీఆర్ 2023 ఎన్నికల నాటికి ఈ వ్యవహారాలు ఇబ్బందికరంగా మారుతాయని, అదే జరిగితే మళ్లీ అధికారంలోకి రావడం కష్టమవుతుందని, రాజకీయంగాను,  వ్యక్తిగతంగా ను ఎంతగానో నష్టపోవాల్సి వస్తుందని ఇలా ఎన్నో లెక్కలు వేసుకుని మళ్ళీ పొలిటికల్ గా యాక్టివ్ అయ్యారు.

అలాగే హుజురాబాద్ ఉప ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని విస్తృతంగా పర్యటనలు చేస్తున్నారు.అలాగే వరుసగా రెండు సార్లు ఢిల్లీకి వెళ్లి బిజెపి కేంద్ర పెద్దలను కలిసి అనేక వ్యవహారాలు చక్కబెట్టారు.

రాష్ట్ర అభివృద్ధి కోసం పెండింగ్ ప్రాజెక్టులకు క్లియరెన్స్, నిధుల విడుదల అంశం ఎలా అనేక విషయాల్లో ప్రగతి సాధించారు.ప్రధాని నరేంద్ర మోది తో పాటు, మిగతా కేంద్రమంత్రులను కలిసి తెలంగాణ ప్రభుత్వానికి మేలు జరిగేలా చేసుకున్నారు.
 

Telugu Etela Rajendar, Hujurabad, Revanth Reddy, Trs-Telugu Political News

 ప్రస్తుతం హుజురాబాద్ ఉప ఎన్నికల నోటిఫికేషన్ కూడా వెలువడడం తో మరింతగా కెసిఆర్ యాక్టివ్ అయ్యారు .ఇకపై తరచుగా జిల్లాలు నియోజకవర్గాల వారీగా పర్యటన చేపట్టేందుకు ఏర్పాట్లు చేసుకుంటున్నారు.అయితే గతంలో ఉన్న ధీమా ఇప్పుడు కేసీఆర్ లో లేకపోవడంతోనే ఇంతగా కంగారు పడుతూ హడావుడి పర్యటనలు చేస్తున్నట్టుగా కనిపిస్తున్నారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube