కేసీఆర్ కు నిద్ర లేకుండా చేస్తున్న రేవంత్ ? 

తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ ప్రభావం పెద్దగా లేకపోయినా, ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి మాత్రం ఎప్పుడూ చురుగ్గా ఉంటూ, రాజకీయ ప్రత్యర్థులపై విమర్శలు చేస్తూ తన క్రెడిట్ తెలంగాణలో మరింత పెంచుకునే విధంగా ప్రయత్నిస్తూనే ఉన్నారు.ముఖ్యంగా కేసీఆర్, కేటీఆర్ వ్యవహారాలకు సంబంధించి రేవంత్ అప్రమత్తంగా ఉంటూనే, వారి బలహీనతలను గుర్తించి వాటిపై విమర్శలు ఎక్కువగా చేస్తూ ఉంటారు.

 Kcr Tention On Revanth Reddy Political Speed  Revanth Reddy ,kcr ,ktr ,telangana-TeluguStop.com

రాజకీయంగాను, వ్యక్తిగతంగానూ కేసీఆర్, కేటీఆర్ పై రేవంత్ విమర్శలు చేస్తూనే వస్తున్నారు.దీంతో బిజెపి కాంగ్రెస్ పార్టీల కంటే రేవంత్ రెడ్డి భయమే ఇద్దరిలోనూ ఎక్కువగా కనిపిస్తూ వస్తోంది.

ప్రస్తుతం తెలంగాణలో ఎన్నికల హడావుడి మొదలైంది.నిజామాబాద్ ఎమ్మెల్సీ ఎన్నికతో పాటు, దుబ్బాక అసెంబ్లీ ఎన్నిక, గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికలు, అలాగే పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలు, ఇలా పెద్ద తతంగమే ఉంది.

ఈ అన్ని ఎన్నికల్లోనూ టీఆర్ఎస్ ఆధిక్యం సాధించి విజయం సొంతం చేసుకుంటుందని ధీమాతో ఉంటూ వచ్చినా, రేవంత్ ను చూసి ఇప్పుడు కేసీఆర్ భయపడుతున్నట్లుగా కనిపిస్తున్నారు.ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీ గెలిచే స్థాయిలో లేకపోయినా, ఫలితాలను తారుమారు చేయగల సమర్ధుడు అని కేసీఆర్ నమ్ముతున్నారు.

అందుకే రేవంత్ ను తక్కువగా అంచనా వేయకూడదనే ఉద్దేశంతో ఎప్పటికప్పుడు ఆయన రాజకీయ ఎత్తుగడలను గమనిస్తూ అప్రమత్తం అవుతున్నట్లు గా కనిపిస్తున్నారు.

Telugu Dubbaka, Ghmc, Revanth Reddy, Telangana-Telugu Political News

ఇది గమనించే రేవంత్ సైతం, దుబ్బాక, నిజామాబాద్, గ్రేటర్ ఎన్నికలపై దృష్టి సారించి టీఆర్ఎస్ బలాన్ని తగ్గించడమే లక్ష్యంగా పెట్టుకున్నట్లుగా కనిపిస్తున్నారు.గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ ఎన్నికలను కేటీఆర్ ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు.ఇక్కడ 2016 లో వచ్చిన ఫలితాలు మాదిరిగా, వందకు పైగా స్థానాలను సంపాదించాలనే ధ్యేయంతో ముందుకు వెళ్తున్నారు.

అయితే రేవంత్ గ్రేటర్ పై ప్రత్యేక దృష్టి సారించి టీఆర్ఎస్ లోని అసంతృప్తులు అందరితోనూ సన్నిహితంగా మెలుగుతూ, టీఆర్ఎస్ గెలుపు అవకాశాలను దెబ్బ తీసే విధంగా ఎత్తుగడలు వేస్తున్నట్లుగా ప్రచారం జరుగుతోంది.

ఇదే ఫార్ములాను నిజామాబాద్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లోనూ వాడేందుకు సిద్ధమవుతున్నారు.

మొత్తంగా తెలంగాణ వ్యాప్తంగా ఉన్న టీఆర్ఎస్ అసంతృప్తులు అందరిని తమ దారిలోకి తెచ్చుకోవాలనే ధ్యేయంగా రేవంత్ అడుగులు వేస్తున్నాడు.ఇదే కేసీఆర్ కు ఆందోళన కలిగిస్తోంది.

ఎన్నికల సమయంలో పార్టీ నాయకులు ఎవరైనా తిరుగుబాటు చేస్తే, ఆ ప్రభావం ఖచ్చితంగా ఎన్నికలపై పడుతుందనే టెన్షన్ లో ఉన్నారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube